Site icon HashtagU Telugu

RIMS Ranchi : రాంచీ రిమ్స్‌లో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చిన మ‌హిళ‌

5 children

5 children

జార్ఖండ్‌లోని రాంచీలోని రిమ్స్‌లో సోమవారం ఓ మహిళ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. మొత్తం ఐదుగురు శిశువులు ఆరోగ్యకరమైన స్థితిలో ఉన్నారు. వీరిని అబ్జ‌ర్వేష‌న్ కోసం నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో ఉంచారు. ఈ విష‌యాన్ని రిమ్స్ రాంచీ త‌న ట్విట్ట‌ర్ లో తెలిపింది. చాటర్‌కు చెందిన ఒక మహిళ RIMSలోని ప్రసూతి & గైనకాలజీ విభాగంలో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చిందని వెల్ల‌డించింది. శిశువులు NICUలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నార‌ని.. ఈ విజయవంతమైన ఆప‌రేష‌న్ డాక్ట‌ర్ శ‌శిబాలా సింగ్ నాయకత్వంలో నిర్వహించిన‌ట్లు తెలిపింది. నవజాత శిశువులు తక్కువ బరువుతో ఉన్నారని.. ప్రస్తుతానికి వారిని NICUలో ఉంచి వైద్యులు ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు రిమ్స్ రాంచీ వెల్ల‌డించింది.