A Women Gave Birth To 5 Children, But what Happened Next?: ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి.. కానీ ఆతర్వాత ఏం జరిగిందంటే?

ఆడవారికి తల్లి అవడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం లాంటిది. అయితే చాలామంది పిల్లలు కలగక గుళ్ళు, గోపురాలు

Published By: HashtagU Telugu Desk
Super Women

Super Women

ఆడవారికి తల్లి అవడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం లాంటిది. అయితే చాలామంది పిల్లలు కలగక గుళ్ళు, గోపురాలు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా వారికి పిల్లలు కలిగే భాగ్యం లేకపోవడంతో బాధపడుతూ ఉంటారు. మరి కొంతమంది తల్లి అయ్యే భాగ్యం లక్షణంగా ఉంటుంది. ఇకపోతే మామూలుగా స్త్రీలు ఒక కాన్పులో ఒక బిడ్డ లేదా ఇద్దరు బిడ్డలు జన్మించడం అన్నది తరచుగా చూస్తూనే ఉంటాం వింటూ ఉంటాం. ఇక ఒకే కడుపులో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది జన్మించడం అన్నది చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఇద్దరు బిడ్డలకంటే ఎక్కువమంది జన్మించిన కూడా అందులో తల్లి కానీ బిడ్డకు కానీ ప్రమాదం ఉండడం వల్ల మరణించిన సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి.

అయితే తాజాగా ఒక మహిళ కూడా ఒకే కాన్పులో ఏకంగా నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని కరౌలీ జిల్లాకు చెందిన ఓ మహిళ సోమవారం ఒకే కాన్పులో ఏకంగా ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఐదు మంది సంతానం కలగడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ దంపతులకు ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే పుట్టిన ఐదు మంది శిశువుల్లో నలుగురు వెంటనే ప్రాణాలు కోల్పోయారు. మరొక శిశువు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో ఆ భార్యాభర్తల ఆర్తనాదాలు హాస్పిటల్లో ప్రతి ఒక్కరిని కదిలించేశాయి. కరౌలీకి చెందిన అష్రఫ్ అలీ భార్య రేష్మ పురుటి నొప్పులతో బాధపడుతూ స్థానిక ఆస్పత్రిలో చేరింది.

సిజేరియన్ కాకుండా సాధారణ ప్రసవం ద్వారానే ఆ మహిళ ఐదుగురికి జన్మనిచ్చినట్లు డాక్టర్ వెల్లడించారు. ఇద్దరు మగపిల్లలు, ముగ్గురు బాలికలు జన్మించినట్లు చెప్పారు. వివాహం జరిగిన చాలా ఏళ్ల వరకు ఆమెకు పిల్లలు లేరు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి మందులు వాడిన తర్వాత ఆమె గర్భవతి అయింది. పెళ్లైన ఏడేళ్ల తర్వాత మహిళకు సంతానం కలిగింది. అయితే ఎట్టకేలకు సంతానం కలిగింది అనుకునే లోపే ఇలా తీవ్ర విషాదం నింపేసింది. ఆ మహిళకు నెలలు నిండకుండా ఏడో నెలలోనే ప్రసవం కావడం వల్లే శిశువులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. చిన్నారులకు మెరుగైన చికిత్స అవసరం అని భావించి జైపూర్‌లోని మరో ఆస్పత్రికి సిఫార్సు చేశారు. అయితే అక్కడకు వెళ్లే లోపే నలుగురు చనిపోయారు. మరో శిశువు చికిత్స పొందుతూ మరణించింది. తల్లి ఆరోగ్యం మాత్రం సురక్షితంగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే చాలా ఏళ్ల తర్వాత తల్లి కాబోతున్నాను అని భావించిన ఆ తల్లికి ఓకె కాన్పులో ఐదు మంది పుట్టడంతో సంతోషంతో పొంగిపోయింది. కానీ ఆ ఐదు మంది ఒకేసారి మరణించడంతో ఆ తల్లి గుండెలు పగిలేలా రోధించింది.

  Last Updated: 27 Jul 2022, 09:04 AM IST