Site icon HashtagU Telugu

Warangal: బైక్‌పై నుంచి పడి మహిళ మృతి

Warangal

Warangal

Warangal: ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు మహిళలు తమ చీర కొంగు లేదా చున్నీని జాగ్రత్తగా చూసుకోవాలి. బైక్ చక్రంలో చున్నీ ఇరుక్కుని ఎంతోమంది ప్రమాదాల బారీన పడుతున్నారు. తాజాగా తెలంగాణలోని వరంగల్ లో విషాదం నెలకొంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వివాహిత కొంగు చక్రంలో ఇరుక్కుని కింద పడింది. దీంతో తలకు తీవ్రంగా గాయమైంది ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె మృతి చెందింది.

వివరాలలోకి వెళితే.. పూజిత, ఆమె భర్త జగన్‌రావు అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు కుమార్తెల్నిఆస్పత్రికి తీసుకువెళ్తున్నారు. పూజిత చీర కొంగు బైక్ వెనుక చక్రంలో ఇరుక్కోవడంతో ఆమె కింద పడిపోయింది. దాంతో తలకు బలమైన గాయమైంది.వెంటనే ఆ మహిళను హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే భర్త జగన్ రావు ఓవర్ స్పీడ్ కారణంగానే పూజిత మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: AP : చంద్రబాబు కస్టడీపై వాదనలు పూర్తి..రేపు తీర్పు