Site icon HashtagU Telugu

Anantapur: చిట్ ఫండ్స్ పేరుతో మ‌హిళ కుచ్చు టోపి.. 20 కోట్ల‌తో ప‌రారీ

chit fund

chit fund

అనంతపురంలో చిట్ ఫండ్స్ పేరుతో ఓ మ‌హిళ‌ వందలాది మందిని మోసం చేసిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. వివరాల్లోకి వెళితే అనంతపురంలోని విద్యుత్ నగర్‌లో జయలక్ష్మి అనే మ‌హిళ బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ స్థానికంగా చిట్ ఫండ్స్ నిర్వహిస్తోంది. చుట్టుపక్కల వారు ఆమెను నమ్మి చిట్‌ హోల్డర్లుగా చేరారు. దాదాపుగా 20 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు వ‌సూళ్లు చేసింది. అయితే ఆ మొత్తాన్ని కస్టమర్లకు చెల్లించేందుకు నిరాకరించి గత రెండేళ్లుగా ఆమె పరారీలో ఉంది.

అయితే ఆమె తన ఇంటిని ఖాళీ చేసి, రాత్రి నగరం నుండి పారిపోవడానికి ప్రయత్నించగా, బాధితులు ఆమెను వెంబడించి ప‌ట్టుకుని ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ లో అప్ప‌గించారు. అయితే సివిల్ కేసు కావడంతో ఆధారాలతో కోర్టుకు వెళ్లాలని బాధితులకు పోలీసులు సూచించారు. మరోవైపు అనంతపురంలోని పలు స్టేషన్లలో ఇప్పటికే ఎనిమిది చెక్‌బౌన్స్‌తోపాటు ఇతర కేసులు ఉన్నట్లు సమాచారం.