Site icon HashtagU Telugu

Bangalore: మహిళా ప్రయాణికురాలతో అసభ్యంగా ప్రవర్తించిన ఉబర్ డ్రైవర్.. లింక్డ్ఇన్లో పోస్ట్?

Bangalore

Bangalore

తాజాగా బెంగళూరులో ఒక మహిళ ప్రయాణికురాలతో ఒక క్యాబ్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించడంతో వెంటనే స్పందించిన సంస్థ అతనిపై చర్యలు తీసుకుంది. అందుకు సంబంధించిన విషయాన్ని సదరు మహిళా ప్రయాణికులు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అసలేం జరిగిందంటే.. బెంగళూరుకు చెందిన ఒక మహిళ బీఎటీఎం రెండో స్టేజీ నుంచి జేపీ నగర్‌ మెట్రో వరకు ఇటీవల క్యాబ్‌ బుక్‌ చేసుకున్నారు. రైడ్‌ మొదలైన కాసేపటికి డ్రైవర్‌ వేరే రూట్‌లో వెళ్లడాన్ని ఆమె గుర్తించారు. డ్రైవర్‌ అనుమానాస్పదంగా వ్యవహరించడంతో ఆమె ఉబర్‌ యాప్‌లో ఫిర్యాదు చేసింది.

దీంతో మళ్లీ నిర్దేశిత రూట్లో ప్రయాణించడం మొదలు పెట్టాడు. ఎందుకైనా మంచిదని రైడ్‌ను ముందుగానే ముగించాలని ఆ మహిళ నిర్ణయించుకుంది. కారు ఆపమని సూచించి అతడికి డబ్బులు చెల్లించింది. అయితే డబ్బులు తీసుకున్న తర్వాత క్యాబ్ డ్రైవర్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. ఆమె ప్రైవేటు పార్టులపై చేతులు వేశాడు. ప్రతిఘటించడంతో ఆమెపై చేయి కూడా చేసుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి ఆ మహిళ బయటపడింది. జనసంచారం ఎక్కువగా ఉన్న చోటుకు పరుగులు తీసింది. వెంటనే తనకు ఎదురైన అనుభవాన్ని వెంటనే లింక్డ్‌ఇన్‌లో పోస్ట్‌ చేసింది.

తన వస్తువులను సైతం కారులో మరిచిపోయానని అందులో ఆమె తెలిపింది. ఆ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ఉబర్‌ వెంటనే స్పందించింది. డ్రైవర్‌పై చర్యలు చేపట్టింది. ఈ విషయాన్ని సైతం ఆమె లింక్డ్‌ఇన్‌ ద్వారా పంచుకున్నారు. తాను పోస్ట్‌ పెట్టిన వెంటనే సత్వరమే స్పందించినందుకు ఉబర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ . భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించింది. అయితే క్యాబ్స్‌లో ప్రయాణించే మహిళల పట్ల డ్రైవర్లుఅనుచితంగా ప్రవర్తించిన ఘటనలు కొత్త కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు వెలుగు లోకి వచ్చాయి.