Site icon HashtagU Telugu

Woman Suicide: హైదరాబాద్ లో మెట్రో రైల్వేస్టేషన్ పై నుండి దూకి మహిళ ఆత్మహత్య

Death Representative Pti

Death Representative Pti

హైదరాబాద్ లో మెట్రోల నుండి దూకి ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పై నుండి దూకి బుధవారం ఓ మహిళ ఆత్మహత్య (Woman Suicide) చేసుకుంది. దీంతో ఆమె తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కు చెందిన మారెమ్మగా గుర్తించారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు. కాగా.. గంతంలో కూడా ఓ యువతి మెట్రో పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ ఆత్మహత్యలకు సంబంధించిన కేసులు నమోదౌతున్నాయి.చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నారు.

Also Read: IT Raids: హైదరాబాద్ లో మళ్లీ ఐటీ దాడులు.. కంపెనీల‌కు షాక్ !