వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎన్నో ఇబ్బందులను పడుతూ ఉంటారు. ఆర్టీవో ఆఫీస్ దగ్గర గంటల తరబడి వేచిచూస్తూ ఉంటారు. అలాగే కొన్నిసార్లు డ్రైవింగ్ టెస్ట్ లో ఫెయిల్ అవుతామేమో డ్రైవింగ్ లైసెన్స్ రాదేమో అని భయపడుతూ ఉంటారు. అయితే డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే డ్రైవింగ్ చేయాల్సిన అవసరం లేకుండానే కేవలం 7 రోజుల్లోనే ఇంట్లో కూర్చుని ఆన్లైన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ ను దరఖాస్తు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నెల నెల కొన్ని వందల మంది డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేస్తూ ఉంటారు.
కానీ డ్రైవింగ్ టెస్ట్ లో ఫెయిల్ అవ్వడం వల్ల చాలామంది లైసెన్స్ ను పొందలేకపోతారు. కాగా ఈ డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కొన్నిమార్పులు జరిగాయి. మోటారు వాహన చట్ట నిబంధన ప్రకారం 16 నుంచి 18 సంవత్సరాల వయసు గల ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. కానీ వాళ్లకు లెర్నింగ్ లైసెన్స్ మాత్రమే లభిస్తుంది. ఆ లైసెన్స్ ద్వారా వాళ్ళు గేర్ లేని వాహనాలను మాత్రమే నడపగలరు. ఈ లైసెన్స్ కోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇందుకోసం మీ ఇంటి నుండి ఆన్లైన్ ద్వారా కొన్ని నిమిషాల్లో దీని దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ గేర్ వాహనాలు నడపాలి అంటే కచ్చితంగా డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సిందే. మీరు ఆ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాతనే సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ ను పొందగలరు.
అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి, సదరు వ్యక్తి వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి. మరి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..మొదట డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించండి. అక్కడ ఉన్న ఎంపికలను బట్టి మీరు ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తు చేసుకోవాలి. సబ్మిట్ చేయాల్సిన పత్రాలను అందించాలి. ఆ తర్వాత RTO వాటిని ధృవీకరిస్తుంది.
పత్రాలు క్లియర్ అయిన అనంతరం, మీరు ఏడు రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందుతార. అయితే ఇది కేవలం లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే.