Site icon HashtagU Telugu

RCB:రాయల్స్ జోరు ముందు బెంగుళూరు నిలిచేనా ?

rcb rr

rcb rr

ఐపీఎల్‌ 2022 సీజన్‌ లో మంగళవారం ఆసక్తి కరమైన పోరు జరగనుంది. ఈ సీజన్ 13వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ,రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీపడనున్నాయి. వాంఖడే మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో తో తాము ఆడిన రెండు మ్యాచుల్లోను విజయం సాధించింది. తొలుత సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 61 పరుగుల తేడాతో గెలుపొందగా.. ఆ తరువాత ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.. ఇక మరోవైపు ఆర్సీబీ ఈ సీజన్ లో తాము ఆడిన తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోగా.. కేకేఆర్ తో ఆడిన రెండో మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇక రాజస్థాన్ రాయల్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య హెడ్ టుహెడ్ రికార్డుల ను పరిశీలిస్తే.. ఈ మెగా టోర్నీలో రాజస్థాన్ , బెంగళూరు రెండు జట్లు మొత్తం 25 మ్యాచ్‌ల్లో తలపడగా బెంగళూరు 12 మ్యాచుల్లో, రాజస్థాన్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. 3 మ్యాచులలో ఫైలితం తేలలేదు.
ఇక ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే.. ఆర్సీబీతో పోలిస్తే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో బలంగా ఉందనే చెప్పాలి. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లో చిన్నచిన్న పోరపాట్లు మినహా రాజస్థాన్ రాయల్స్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిందని చెప్పొచ్చు… ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్‌ సంజూ శాంసన్ తొలి రెండు మ్యాచ్ లో తనకున్న వనరులను చక్కగా ఉపయోగించుకోగా, సీనియర్‌ బ్యాటర్‌ జొస్ బట్లర్ , హెట్ మేయర్ సూపర్ ఫామ్‌లో ఉండడం రాజస్థాన్ రాయల్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక బ్యాటింగ్‌లో బట్లర్, శాంసన్ , హెట్ మేయర్, పడిక్కాల్ .. బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ కృష్ణ , అశ్విన్ ,చాహల్ , సైనీ మంచి టచ్‌లో ఉండటం రాజస్థాన్ రాయల్స్ కు శుభపరిణామమని చెప్పాలి..

ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విషయానికొస్తే.. పంజాబ్ కింగ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో రాణించిన ఆ జట్టు బ్యాటర్లు కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఫాఫ్ డుప్లెసిస్ తొలి మ్యాచ్ లో రాణించినప్పటికీ రెనో మ్యాచ్ లో విఫలమయ్యాడు. అలాగే విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. ఇక ఆస్ట్రేలియా విధ్వసంకర ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఆర్సీబీ జట్టుతో చేరినప్పటికీ మూడు రోజులు పాటు క్వారంటైన్‌లో ఉండనున్నాడు. ఈ క్రమంలో ఈ మ్యాచ్ కు మాక్స్‌వెల్‌ దూరంగా ఉండనున్నాడు.. ఇక బౌలింగ్ లో హాసరంగా, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ , డేవిడ్ విల్లే ఫామ్ లో ఉండడం ఊరటనిచ్చే అంశాలు. రాజస్థాన్ జోరుకు బ్రేక్ వేయాలంటే బెంగళూర్ స్థాయికి తగినట్టు ఆటతీరు కనబరచాల్సిందే.