Site icon HashtagU Telugu

Telangana Elections : తెలంగాణ‌లో ఆ రెండు రోజులు వైన్ షాపులు, బార్లు బంద్

Bars

Bars

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా నవంబర్ 28 నుంచి 30 వరకు వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు సహా మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. నవంబర్ 28 సాయంత్రం 5 గంటల నుండి నవంబర్ 30 పోలింగ్ ముగిసే వరకు అవి మూసివేయబడతాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు రోజున కూడా వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు మూసివేయబడతాయి.పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 48 గంటల పాటు మద్యం, విక్రయాలపై పూర్తి నిషేధం అమలు చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. ఈ రోజు (నవంబర్ 3న) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబ‌ర్ 3న ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది.