Site icon HashtagU Telugu

Wine Shops Closed: మందు బాబులకు షాక్.. ఇవాళ, రేపు వైన్స్‌లు బంద్‌!

Wines

Wines

హైదరాబాద్‌లో నేడు గణేష్‌ నిమజ్జనం జరుగనుంది. ఇవాళ, రేపు వైన్స్‌లు బంద్‌ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ మహానగరంలో రెండు రోజులపాటు మద్యం షాపులు మూతపడ్డాయి. మద్యం షాపులు తిరిగి ఆదివారం రోజున ప్రారంభం కానున్నాయి. ఇది ఇలా ఉండగా… హైదరాబాద్ లోని హుస్సేన్‌ సాగర్‌ దగ్గర భారీ ఏర్పాట్లు.. చేశారు. అటు రేపు ఉదయం వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో నేడు సెలవుగా ప్రకటించింది ప్రభుత్వం.