Site icon HashtagU Telugu

Wine Shops : మ‌ద్యం షాపుల టెండ‌ర్ల‌కు సిద్ద‌మైన ఎక్సైజ్ శాఖ‌.. ఈ నెల 4న నోటిఫికేష‌న్‌

Bars

Bars

2023-2025 రెండేళ్ల‌కు మ‌ద్యం షాపుల‌కు లైసెన్సులు మంజూరు కానున్నాయి. రాష్ట్రంలోని 2 వేలా 620 ఏ 4 దుకాణాల ద్వారా మద్యం విక్రయించడం కోసం లైసెన్సులు మంజూరు చేసే ప్రక్రియను ఎక్సైజ్‌ శాఖ ప్రారంభించింది. ఈ మేరకు ఈనెల 4 న నోటిఫికేషన్‌ విడుదల చేయ‌నుంది. ఆ ప్రకారం నిర్వహించాల్సిన ప్రక్రియపై అన్ని జిల్లాల ఎక్సైజ్‌ అధికారులతో రాష్ట్ర ఎక్సైజ్‌ డైరెక్టర్‌ ఫారూఖీ, ఇతర ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. మద్యం ఆక్షన్ల ప్రక్రియపై వాళ్లకు మార్గనిర్దేశనం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈనెల 4 వ తేదీన నోటిఫికేషన్‌ రానుండగా, అదేరోజు నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈనెల 20 లేదా 21 వ తేదీన లాటరీలు నిర్వహించి షాపులు కేటాయించనున్నట్లు సమాచారం. అయితే, గత రెండేళ్ల పాలసీనే ఈసారి కూడా అమలు చేస్తారని, దరఖాస్తు ఫీజు, దుకాణాల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదని, ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు యథాతథంగా అమలవుతాయని తెలుస్తోంది.

Exit mobile version