Site icon HashtagU Telugu

Hyderabad : గ‌ణేష్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా నేడు న‌గ‌రంలో వైన్ షాపులు బంద్‌

Bars

Bars

హైద‌రాబాద్‌లో ఈ రోజు వైన్ షాపులు, బార్లు మూత‌ప‌డ్డాయి. న‌గ‌రంలో గ‌ణేష్ శోభాయాత్ర జ‌రుగుతుండ‌టంతో పోలీసులు బార్లు, వైన్ షాపుల‌ను మూసివేయించారు. శాంతిభ‌ద్ర‌త‌ల దృష్ట్యా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. స్టార్ హోటళ్లలోని బార్‌లు, రిజిస్టర్డ్ క్లబ్‌లను లోపల మూసివేయాలని సైబ‌రాబాద్ సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. గణేష్ విగ్రహాలనిమజ్జనం సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్ 28 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 29 ఉదయం 8 గంటల వరకు అమలులో ఉంటుంది. నోటిఫికేషన్‌ను ఉల్లంఘించిన వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని ఎస్‌హెచ్‌ఓలందరికీ సీపీ అధికారం ఇచ్చారు.

Exit mobile version