Telangana Elections 2023 : రెండు రోజుల పాటు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

తెలంగాణలో రెండు రోజుల పాటు వైన్ షాపులు, బార్‌లు, పబ్బులు మూసివేస్తున్న‌ట్లు ఎక్సైజ్ శాఖ ప్ర‌క‌టించింది. నవంబర్ 28

Published By: HashtagU Telugu Desk
Bars

Bars

తెలంగాణలో రెండు రోజుల పాటు వైన్ షాపులు, బార్‌లు, పబ్బులు మూసివేస్తున్న‌ట్లు ఎక్సైజ్ శాఖ ప్ర‌క‌టించింది. నవంబర్ 28 సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 30 వరకు మ‌ద్యం దుకాణాలు మూసివేయ‌నున్నారు. తిరిగి డిసెంబర్ 1 న ప్రారంభమవుతాయ‌ని ఎక్సైజ్ శాఖ తెలిపింది. తెలంగాణ‌లో రేపు (న‌వంబ‌ర్ 30) ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో రెండు రోజుల పాటు వైన్‌షాపులు బంద్ చేశారు. మళ్లీ ఓట్ల లెక్కింపు రోజు కూడా మ‌ద్యం దుకాణాలు మూసివేయ‌నున్న‌ట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాలకు ఎక్సైజ్ శాఖ అధికారులు సీల్ వేశారు. ఈ సందర్భంగా కట్టుదిట్టమైన పర్యవేక్షణ కోసం అధికారులు 60 మంది సిబ్బందిని నియమించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కంట్రోల్ రూం 040-2465747 నంబర్‌లో సంప్రదించవచ్చని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

Also Read:  CBN : డిసెంబర్ 1న తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకోనున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు

  Last Updated: 29 Nov 2023, 07:17 AM IST