Site icon HashtagU Telugu

Minister Ponnam: కేసీఆర్, బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చెశారో చెబుతారా: మంత్రి పొన్నం

Ponnam

Ponnam

Minister Ponnam: మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. క రీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడు తూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను ఎండగట్టారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని కోరారు. కెసిఆర్, వినోద్‌కుమార్ కరీంనగర్ ఎంపిలుగా ఏం అభివృద్ధి చేశారో, తాను ఎంపిగా ఏంచేశానో చర్చకు వస్తారా అని సవాల్ చేశారు. కెటిఆర్ అధికారం కోల్పోయిన అసహనంతో ఉన్నారని ఎద్దేవా చేశారు. సిఎం పదవి కన్నా కెసిఆర్ పవర్‌ఫుల్ అనేది భ్రమ, కెసిఆర్ పదానికి పూజ చేసుకోండి అని ఎద్దేవా చేశారు.

సిఎం పదవి ఎడమకాలి చెప్పుతో సమానం అని తండ్రి అంటే.. కొడుకు సిఎం పదం కంటే కెసిఆర్ పదం పవర్ అంటున్నాడని అన్నారు. తమ ప్రభుత్వాన్ని బిఆర్‌ఎస్ కూల గొడుతుందని బండి మాట్లాడడం ఇందుకు నిదర్శనం కాదా అన్నారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఎలను ముట్టుకునే ధైర్యం ఉందా… అంత ధైర్యం ఎవరూ చేయరని అన్నారు. ప్రభుత్వాన్ని కూలగొట్టే ధైర్యం బిఆర్‌ఎస్‌కి లేదన్నారు. జగద్గురు చెప్పినా అశాస్త్రీయంగా అయోధ్య రామాలయం ప్రారంభిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఇది ఎన్నికల స్టంటేనని, లింగ ప్రాణప్రతిష్ఠ ఎవరు చేయాలో తెలియదా, ఇది అరిష్టం కాదా అన్నారు. రాముడి కటౌట్లు పెట్టుకుని బిజెపి ఓట్లు అడుగుతోందని ఆరోపించారు. బండి సంజయ్ మాట్లాడిన మాటలు జ్యోతిషం చెప్పినట్లుగా ఉందన్నారు. వైఫల్యం చెందిన ఎంపిలలో బండి సంజయ్ నంబర్ వన్ అని ఆరోపించారు. మాజీ ఎంపి వినోద్‌కుమార్ కరీంనగర్‌కు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందన్నారు.

Exit mobile version