Site icon HashtagU Telugu

RCB: లక్నోతో తలపడే ఆర్సీబీ తుదిజట్టు ఇదే

Rcb

Rcb

ఐపీఎల్‌-2022లో భాగంగా మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ద‌మైంది. ఇవాళ బ్రబౌర్న్ వేదిక‌గా లక్నో సూపర్ జెయింట్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టుతో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇరు జట్లు ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజ‌యాలు సాధించగా.. ఇందులో లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా ఆర్సీబీ జట్టు నాలుగో ప్లేస్ లో ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సెంచరీతో దుమ్మురేపాడు. అలాగే లక్నో జట్టు లో క్వింటన్ డికాక్, మనీష్ పాండే, దీపక్ హుడా, ఆయుష్ బదోని, జాసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్ ,అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ నిలకడగా రాణించడం ఆ జట్టుకి కలిసొచ్చే అంశం అని చెప్పొచ్చు.

ఇక మరోవైపు గత మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ అనుజ్ రావత్, షాబాజ్ అహ్మద్ ,మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ , హర్షల్ పటేల్, సిరాజ్, హాజిల్ వుడ్ ,హసరంగ‌ వంటి ఆటగాళ్లు చెలరేగి ఆడుతున్నారు. ఇది ఆ జట్టుకి శుభపరిణామం అని చెప్పొచ్చు. ఇక ఈ మ్యాచ్ లో లక్నోను ఢీకొట్టే ఆర్సీబీ తుదిజట్టును పరిశీలిస్తే.. ఓపెనర్లుగా ఫాఫ్ డుప్లెసిస్, అనుజ్ రావత్ రానుండగా.., మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, మిడిలార్డర్ లో గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, లోయర్ ఆర్డర్ లో దినేష్ కార్తీక్, సుయాశ్ ప్రభుదేశాయ్, బ్యాటింగ్ కు రానున్నారు. ఇక ఆర్సీబీ బౌలింగ్ విషయానికొస్తే ఆ జట్టు బౌలింగ్ బాధ్యతలను వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హాజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్ మోయనున్నారు.

Exit mobile version