Telangana : కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని లైట్ తీసుకుంటుందా..?

సొంత పార్టీ నేతలు , ప్రజలు , అధిష్టానం ఇలా అంత కూడా ఆయన్ను ఒంటరివాడ్ని చేస్తున్నట్లు అర్ధం అవుతుంది

  • Written By:
  • Publish Date - September 14, 2023 / 11:23 AM IST

కోమటిరెడ్డి బ్రదర్స్ (Komatireddy brothers) ఈ పేరుకు ఎంతో ఆదరణ ..గుర్తింపు..పలుకుబడి..ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే వామ్మో…అనుకునేవారు. ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ హవా మాములుగా ఉండేది కాదు. 2009 నుంచి 2018 వరకు నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా బలమైన నేతలుగా ఉంటూ వచ్చారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (komatireddy Rajagopal Reddy) కాంగ్రెస్ వీడి బిజెపిలో చేరిన తరువాత అంత మారిపోయింది. మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి బిజెపి తరుపున పోటీచేశారు..పరోక్షంగా సోదరుడు వెంకట్ రెడ్డి (komatireddy venkat reddy) సైతం రాజగోపాల్ రెడ్డి గెలుపుకు తనదైన కృషి చేసారు కానీ బిఆర్ఎస్ ఎత్తుగడల ముందు గెలుపు సాధ్యపడలేదు.

మునుగోడు ఉప ఎన్నిక సమయంలో తమ్ముడి కోసం సొంత పార్టీకే వెన్నుపోటు పొడిచేందుకు వెంకటరెడ్డి ప్రయత్నించారని అధిస్థానం సీరియస్ అయ్యింది. ఆ టైమ్ లో షోకాజ్ నోటీసులు సైతం జారీ చేసింది. దాంతో సొంత పార్టీ నేతలే ఆయనను వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆయన మాత్రం పార్టీ విడలేదు. బ్రదర్స్ ఇద్దరు చెరో దారి చూసుకోవడంతో ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వీరి హవా రోజు రోజుకు మరింత తగ్గుతూ వచ్చింది. దాంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో పొమ్మనలేక పొగ పెడుతున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరిస్తున్నట్లు టాక్. అందుకే వెంకట్ రెడ్డి విషయంలో కేంద్రం (Congress Party Adhishtanam) లైట్ తీసుకుంటూ వస్తుంది.

Read Also : Parliament Special Session: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా విడుదల.. ఈ 4 బిల్లులపై చర్చ.. వాటి పూర్తి వివరాలివే..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాను సూచించిన వారికే టికెట్లు ఇవ్వాలని వెంకటరెడ్డి చెబుతున్నప్పటికి.. ఆలా ఏమిలేదులే..అన్నట్లు అధిష్టానం వ్యవహరిస్తోంది. మరోపక్క సొంత నియోజకవర్గంలో కూడా వెంకట్ రెడ్డి హావ బాగా తగ్గింది. ఆయన మాటను ఎవ్వరు పెద్దగా లెక్క చేయడం లేదు. ప్రజలు సైతం ఒక్కప్పుడు వెంకట్ రెడ్డి వేరు..ఇప్పుడు వేరు..ఆయన చేసింది ఇప్పుడు ఏమిలేదు..అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇదే క్రమంలో నల్గొండ నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవసరమైతే తాను సీటు త్యాగం చేయడానికి సిద్దంగా ఉన్నానంటూ ఇటీవల చెప్పుకొచ్చారు. దీంతో ఆయనకు గెలుపు విషయంలో ధీమా లేనందువల్లే సీటు త్యాగం చేయడానికి రెడీ అవుతున్నారని సొంత పార్టీ నేతలే మాట్లాడుకోవడం చేస్తున్నారు. ఇలా సొంత పార్టీ నేతలు , ప్రజలు , అధిష్టానం ఇలా అంత కూడా ఆయన్ను ఒంటరివాడ్ని చేస్తున్నట్లు అర్ధం అవుతుంది. ఇవన్నీ చూస్తున్న రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర ముగిసినట్లేనని అని చెపుతున్నారు.