Site icon HashtagU Telugu

Errolla: కేసీఆర్ పోరాడకుంటే తెలంగాణ వచ్చేదా : ఎర్రోళ్ల

Errolla Srinivas

Errolla Srinivas

Errolla: తెలంగాణ ఎస్సీ ,ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సోనియా ఇచ్చింది కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ నేతలు బూటకపు ప్రచారం చేస్తోందని, 1969 ఉద్యమం లో 369 మంది ని కాంగ్రెస్ ప్రభుత్వం పొట్టన పెట్టుకోలేదా ? అని ఎర్రోళ్ల అన్నారు. మలి దశ ఉద్యమం లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది విద్యార్థులను యువకులను కాంగ్రెస్ బలి తీసుకుందని అన్నారు. కాంగ్రెస్ చరిత్ర అంతా మోసం దగా అని, తామే తెలంగాణ తెచ్చామని కాంగ్రెస్ అనడం దయ్యాలు వేదాలు వల్లించడమే అని మండిపడ్డారు.

‘‘2001 లొ కేసీఆర్ టీ ఆర్ ఎస్ పెట్టి పోరాడకుంటే తెలంగాణ వచ్చేదా.. నీలం సంజీవ రెడ్డి నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరకు కాంగ్రెస్ ది ద్రోహాల చరిత్రే. ఈ రోజు కాంగ్రెస్ ఉత్సవాలు జరుపడం హంతకుడే సంతాప సభ పెట్టినట్టు ఉంది. ఏనాడూ జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నాడు. ఈ ఆరు నెలల్లో సీఎం రేవంత్ ఏనాడూ తెలంగాణ అమర వీరుల స్థూపం దగ్గరకు వెళ్ళలేదు ..జై తెలంగాణ అనలేదు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఉత్సవాలు జరపడం తెలంగాణ వాదులు ఎవరూ హర్షించడం లేదు అని అన్నారు.

తెలంగాణ ద్రోహుల చేతికి రాష్ట్రం వెళ్ళిందని, రేవంత్ రెడ్డి జై తెలంగాణ ఎందుకు అనడం లేదు ..ఆయన ఆంధ్రా సంతతి వాడా ? .కేసీఆర్ ప్రారభించిన ఉద్యమాన్ని  ణిచివేసేందుకు కాంగ్రెస్ పార్టి చాలా ప్రయత్నాలు చేసిందని ఎర్రోళ్ల అన్నారు.