Will Smith:ఆస్కార్ నుంచి విల్ స్మిత్ 10ఏళ్లపాటు నిషేధం..!!

అస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తొందరపాటు నిర్ణయానికి భారీ మూల్యం చెల్లించుకోవల్సి వచ్చింది. అవార్డుల ప్రదానోత్సవ వేదికపై వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న కమెడియన్ క్రిస్ రాక్ పై విల్ స్మిత్ చేయిచేసుకున్న సంగతి తెలిసిందే.

  • Written By:
  • Publish Date - April 9, 2022 / 10:32 AM IST

అస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తొందరపాటు నిర్ణయానికి భారీ మూల్యం చెల్లించుకోవల్సి వచ్చింది. అవార్డుల ప్రదానోత్సవ వేదికపై వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న కమెడియన్ క్రిస్ రాక్ పై విల్ స్మిత్ చేయిచేసుకున్న సంగతి తెలిసిందే. విల్ స్మిత్ ప్రవర్తన పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో విల్ స్మిత్ ను పది సంవత్సరాల పాటు ఆస్కార్ కు హాజరుకాకుండా నిషేధించారు. వచ్చే దశాబ్దంలో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నిర్వహించే ఏ ఇతర ఈవెంట్ లకు హాజరయ్యేందుకు స్మిత్ కు అనుమతి లేదు.

అకాడమీ బోర్డు సమావేశమై జరిపిన చర్చల్లో పలు కీలక విషయాలపై నిర్ణయం తీసుకుంది. స్మిత్ గెలుచుకున్న కింగ్ రిచర్డ్ బెస్ట్ అవార్డును రద్దు చేయాలా లేదా భవిష్యత్తుల ఆస్కార్ నామినేషన్లపై ఎలాంటి నిషేధాన్ని వెల్లడించలేదు. ఏప్రిల్ 8, 2022 నుంచి 10 సంవత్సరాల పాటు స్మిత్ అకాడమీ అవార్డులతోపాటు వ్యక్తిగతంగా ఎలాంటి అకాడమీ ఈవెంట్ లు లేదా ప్రోగ్రాంలకు హాజరకావడానికి వీలు లేదని బోర్డు నిర్ణయించింది.

ఈక్రమంలోనే విల్ స్మిత్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. మోషన్ పిక్చర్ అకాడమీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఆయన ప్రకటించారు. బోర్డు ఎలాంటి శిక్ష వేసినా…దానికి తాను అంగీకరిస్తానని తెలిపారు.