Site icon HashtagU Telugu

KTR : వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తా: కేటీఆర్‌

Will do padayatra from next year: KTR

Will do padayatra from next year: KTR

KTR : బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేటలో గురువారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం అనంతరం కేటీఆర్‌ మీడియాతో చిట్‌ చాట్‌ నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ అధికారమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. సూర్యాపేటలో జనాల్ని చూస్తుంటే పెద్ద బహిరంగ సభకే వచ్చినట్లుంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ దే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. బడ్జెట్‌లో పథకాల అమలుకు సంబంధించి నిధుల కేటాయింపు లేదు. రుణమాఫీ చేశారో లేదో సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఊరికి వెళ్లి అడుగుదాం. తెలంగాణ ధనం అంతా రాహుల్, సోనియా, ప్రియాంకా గాంధీ ఖాతాలో పడుతున్నాయి. ధాన్యం దిగుమతిలో తెలంగాణలో నల్లగొండను కేసీఆర్ నంబర్ వన్ చేశారు.

Read Also: Chahal- Dhanashree Divorce : అధికారికంగా విడిపోయిన చాహ‌ల్‌- ధ‌న‌శ్రీ.. వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగింది ఇదే!

మరోసారి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు శత్రువులే. కేసీఆర్‌పై ద్వేషంతో జిల్లాలో పంటలకు నీళ్లు ఇవ్వడం లేదు. కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు ఇది. చెరువులు నింపితే బోర్లు ఎందుకు ఎండిపోతాయి. రేవంత్‌కు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఒక్క మాట మాట్లాడదు. ఏం మాట్లాడకముందే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అసెంబ్లీని గాంధీభవన్ అన్న మజ్లిస్ సభ్యులపై చర్యలు తీసుకునే దమ్ము లేదా? అని ప్రశ్నించారు. ఎస్‌ఎల్‌బీసీలో విషాదం జరిగితే మంత్రులు చేపల కూర తింటున్నారు. ఓ మంత్రి నీళ్లు, వాటర్ కలిశాయని అంటున్నారు. గాడిదలను చూస్తేనే గుర్రాల విలువ తెలుస్తుదన్నారు.

ఇక, ప్రస్తుతం జిల్లాల పర్యటనలు ప్రారంభించానన్న కేటీఆర్.. డిసెంబరు వరకు పార్టీ బలోపేతం చేసే కార్యక్రమాల్లో నిమగ్నం అవుతామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవాలతో పాటు శిక్షణా తరగతులు, సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు సంస్థాగత కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్లు వివరించారు. పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు అద్భుత స్పందన వస్తోందన్నారు. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే కేసీఆర్ లాగా ప్రతీ కార్యకర్త కథానాయకుడిలాగా విజృంభించాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 27 నాడు దానికి తొలి అడుగు పడాలన్నారు. ఈ సంవత్సరం అంతా బీఆర్ఎస్ పోరాటనామ సంవత్సరం కాబోతోందన్నారు. పార్టీ ఆఫీసులను చైతన్య కేంద్రాలుగా మార్చుకొని కార్యకర్తలకు అద్భుతంగా శిక్షణ ఇస్తామన్నారు. చివరి సంవత్సరంలో ఏదో ఒక పథకం ఇచ్చినట్టు చేస్తే ప్రజలు తమనే మళ్లీ గెలిపిస్తారన్న నమ్మకంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారని ధ్వజమెత్తారు. ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా గులాబీ కార్యకర్తలే చెప్పాలని సూచించారు.

Read Also:  Wife Victim : మరో భార్యా బాధితుడు.. రోజూ రూ.5వేలు ఇస్తేనే కాపురమట