Site icon HashtagU Telugu

odisha: ఇదెక్కడి విడ్డూరం..భర్త ఈఎంఐ లో ఫోన్ కొనిచ్చాడని భార్య ఆత్మహత్య?

Odisha

Odisha

టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ వినియోగించే వారి సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తూనే ఉన్నారు. దీంతో పల్లెల్లో, పట్టణాలలో ప్రతి ఇంటికి కనీసం రెండు స్మార్ట్ ఫోన్ లు అయినా ఉంటున్నాయి. ఇక ఉదయం లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు కూడా ఎక్కువగా ఈ స్మార్ట్ ఫోన్లను చూసుకుంటూ చాలా మంది కాలక్షేపం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత మనుషుల మధ్య ఉన్న బంధాలు కూడా దూరమయ్యాయి అని చెప్పవచ్చు.

తల్లిదండ్రులు పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి, పిల్లలు తల్లిదండ్రులతో కలిసి మాట్లాడడానికి కూడా సమయం కుదరడం లేదు. అందుకు గల కారణం స్మార్ట్ ఫోన్ వినియోగం అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుత రోజుల్లో ఎవరి చేతుల్లో చూసిన స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తూ ఉంటాయి. దీంతో స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నవారు వాటిని చూసి బాధపడుతూ ఉంటారు. ఇక పిల్లలు అయితే తల్లిదండ్రుల దగ్గర గోల చేసి మరీ వారిని బెదిరించి అయినా సరే స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం, అలాగే స్మార్ట్ ఫోన్ కి డబ్బులు ఇవ్వలేదని తల్లిదండ్రులను చంపిన ఘటనలు కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి.

అయితే తాజాగా జరిగిన ఘటన అందుకు పూర్తి విరుద్ధం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక భర్త ఈఎంఐ లో ఫోన్ కొనిచ్చాడు అని ఒక భార్య ఏకంగా ఆత్మహత్య చేసుకుంది. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది నిజం. ఒడిశాలోని మల్కాన్ గిరి కి చెందిన జ్యోతి, ఆమె భర్త నివసిస్తూ ఉండేవారు. అయితే గతంలో జ్యోతి భర్త ఆమెకు ఖరీదైన ఫోన్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక ఆ ఫోన్ కి ఈఎంఐ కడుతూ ఉండగా తాజాగా అది తీరిపోవడంతో ఫైనాన్స్ కంపెనీ వారు జ్యోతి భర్త సంతకం కోసం ఇంటికి వచ్చారు. తన భర్త ఈఎంఐ లో పోనీ కొనుగోలు చేశాడు అని తెలుసుకున్న భార్య జ్యోతి తన భర్తతో వాదనకు దిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఆవేశంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.