Kurnool: భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించిన భార్య.. ఎక్కడో తెలుసా?

తల్లిదండ్రులు పిల్లల్ని కనీ పెంచి పెద్ద చేసి వారిని ప్రయోజకులను చేసిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి వారి స్వార్థాలను వారు చూసుకుంటు

  • Written By:
  • Publish Date - May 29, 2023 / 07:30 PM IST

తల్లిదండ్రులు పిల్లల్ని కనీ పెంచి పెద్ద చేసి వారిని ప్రయోజకులను చేసిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి వారి స్వార్థాలను వారు చూసుకుంటున్నారు. తల్లిదండ్రులను భారంగా భావించి వృద్ధాశ్రమాలలో వదిలిపెట్టడం నడిరోడ్డుపై విడిచి వెళ్లిపోవడం లేదంటే చంపేయడం లాంటివి చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కడ చూసినా పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. తల్లిదండ్రుల ఆలనాపాలనా చూడకుండా వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పిల్లలు వేరు కాపురాలంటూ తల్లిదండ్రులకు దూరంగా బతుకుతున్నారు. కొంతమంది దుర్మార్గపు కొడుకు కూతుర్లు కనీసం తల్లిదండ్రుల ఆఖరి చూపుకు కూడా నోచుకోవడం లేదు.

తాజాగా ఒక మహిళ తన భర్త చనిపోవడంతో కుమారులు లేక ఇంట్లోనే సంస్కారాలు నిర్వహించింది. అసలేం జరిగిందంటే.. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో హరికృష్ణ ప్రసాద్, లలిత దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్దకుమారుడు దినేశ్ ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఉద్యోగి. చిన్న కుమారుడు ముఖేశ్ కెనడాలో స్థిరపడ్డాడు. గత 15 సంవత్సరాల నుండి హరికృష్ణ ప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. భార్య లలిత ఆయనకు సపర్యలు చేస్తుంది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం హరికృష్ణ మంచంపై అచేతనంగా ఉండడంతో చనిపోయినట్లు భార్య లలిత గుర్తించింది. సహాయం కోసం ఎవరిని పిలవకుండా ఇంట్లోనే భర్త దహనసంస్కరాలు చేసే ప్రయత్నం చేసింది.

సోమవారం ఉదయం వీరి ఇంటినుండి పొగలు రావడంతో చుట్టుపక్కల వారు చూసి.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వచ్చి పరిశీలించారు. అప్పటికే బాడీ 80 శాతం కాలిపోయింది. భార్య లలితను విచారించగా తన భర్త సోమవారం ఉదయం చనిపోయినట్లు లలిత తెలిపింది. వారికి ఇద్దరు కొడుకులు ఉన్నట్లు, వారు ఆస్తి కోసమే తమ వద్దకు వస్తారని తెలిపింది. వారు తన భర్త చనిపోయాడని తెలిస్తే ఆస్తి కోసం గొడవ చేస్తారని. ఇంట్లోనే అట్టపెట్టెలతో దహన సంస్కారాలు చేశానని లలిత చెప్పింది. కానీ స్థానికులు, కొడుకులు ఇచ్చిన సమాచారం మేరకు భార్య లలితకు మానసిక పరిస్థితి బాగాలేదని పోలీసులు గుర్తించారు.