Koppula: కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోలులో ఎందుకు జాప్యం జరుగుతుంది- కొప్పుల

  • Written By:
  • Publish Date - May 6, 2024 / 11:29 PM IST

Koppula: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మందమర్రి మండలం నుండి చెన్నూర్ మార్గ మధ్యంలో సారంగపల్లి గ్రామానికి చెందిన రైతుల కోరిక మేరకు ఐకేపీ కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల కలిసి పరిశీలించారు. దాదాపు రెండు నెలల నుంచి కల్లాల్లో ఓడ్లుపోసుకొని కూసున్నామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొంటలేరని రైతులు కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్ ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు కాకా రైతులు ఆవేదన చెందుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కొప్పుల అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చెరువులో నీళ్లు అడగండి, గ్రౌండ్ లెవెల్ నీళ్ళు తగ్గిపోయాయి బోర్లు, బావులు ఎండిపోతున్న పరిస్థితి ఉందని, రైతులు పండించిన పంటకు అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేవారు.

ప్రభుత్వం మిల్లులు కేటాయించకపోవడంతో ఎవరికి అమ్మాలో దిక్కు తోచక ప్రైవేటు మిల్లులకు 1700 నుండి 1800 కు ధాన్యం అమ్మి రైతులు నష్టపోతున్నారని, కెసిఆర్ ప్రభుత్వం లో 3 కోట్ల 50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, 10 సంవత్సరాల పాలనలో తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొన్న ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అని అన్నారు.