Bird: పక్షికి మాత్రమే పిండం పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో వినిపిస్తున్న సినిమా పేరు బలగం. ఇటీవల చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా

  • Written By:
  • Publish Date - April 13, 2023 / 06:05 PM IST

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో వినిపిస్తున్న సినిమా పేరు బలగం. ఇటీవల చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడం తో పాటు పెద్ద పెద్ద ప్రముఖుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంటోంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఈ సినిమా చూసిన తర్వాత కన్నీరు పెట్టని ప్రేక్షకుడు ఉండరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లో సక్సెస్ఫుల్గా కొనసాగడంతో పాటు ఓటీటలో కూడా ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.

ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా గురించే చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. మరి ముఖ్యంగా ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశం చూసి ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టాల్సిందే. ఈ సినిమా పిండ ప్రధానం చుట్టూనే తిరుగుతుంది. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి ఇష్టమైన ఆహారాన్నింటినీ వండి అతని మూడవ రోజుల చిన్న దినం అయిదవరోజు చివరిగా 11వ రోజున ఉంచుతారు. అయితే తొలి రెండు రోజుల్లో పక్షి ముద్దమట్టదు. దశదినకర్మ రోజు పక్షి ముద్ద ముట్టకపోతే వారి ఆత్మ ఘోషిస్తుంది అనే కథ చెబుతారు.

ఒకవేళ నిజంగానే పక్షి ముద్దమట్టకపోతే ఆత్మను శాంతించవా? కుటుంబానికి అదృష్టం పడుతుందా అన్న వివరాల్లోకి వెళితే.. ఈ విషయం గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గరుడ పురాణంలో మనిషి చనిపోయిన తర్వాత తన ఆత్మ ప్రేతాత్మగా మారి పక్షి రూపంలో అక్కడే అదే ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి స్మశాన వాటిక వద్దకు వెళ్లి అక్కడ పెట్టి మొక్కుతారు. అలా చేయడం వల్ల పక్షి రూపంలో మనిషి ఆత్మ వచ్చి వాటిని రుచి చూసి వెళుతుంది అని ఫలితంగా ఆ ఆత్మ శాంతిస్తుందని భావిస్తూ ఉంటారు. అలాగే మనిషి చనిపోయిన తర్వాత 11 రోజులకు పిండప్రదానం చేసి కాకికి పెడుతూ ఉంటారు..