దేశవ్యాప్తంగా ఎక్కువ శాతం మంది పూచించే దేవుళ్ళలో పరమేశ్వరుడు కూడా ఒకరు. పరమేశ్వరుని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. కొంతమంది విగ్రహాన్ని లేదా లింగ రూపంలో ఉన్న పరమేశ్వరుని ఇంట్లో పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. అయితే పూజించడం మంచిదే కానీ ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సాధారణంగా పూజ చేస్తేనే పరమేశ్వరుడికి ఇష్టమట. ఇంట్లో శివలింగం ఉంటే తప్పకుండా నీటి దార ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. అలా లేకపోతే పూజ చేసినా కూడా ఆ పూజ ఫలితం దక్కదని చెబుతున్నారు.
అలాగే అందంగా అలంకరణలు, పెద్ద పెద్ద నైవేద్యాలు,పళ్ళు ఇవేవీ శివుడ్ని పూజించటానికి అవసరం ఉండదు. పురాణాలలో పరమశివుడు కేవలం దత్త పండు, బిల్వ ఆకులు, కల్లు, తాజా చల్లని ఆవుపాలు, గంధపు పేస్టు, భస్మం వీటితోనే ఆనందపడతాడని రాసి ఉంది.హిందూ మతంలో, పరమశివున్ని క్రమం తప్పకుండా పూజించటం, ధ్యానించటం వలన ఇతర దేవదేవతలు కూడా అనుగ్రహిస్తారని నమ్ముతారు. అయితే చాలా మంది తెలిసి తెలియక పరమేశ్వరుడికి పసుపును సమర్పిస్తూ ఉంటారు.
పసుపు అన్ని మతాచారాలలో చాలా పవిత్రమైనదని గుర్తించినా, అందరు దేవతలను పూజించటానికి ఉపయోగించిన, పసుపును పరమశివుడికి లేదా ఆయన శివలింగానికి ఎన్నటికీ వినియోగించరు. పురాణాల ప్రకారం శివలింగాన్ని పురుషయోనికి గుర్తుగా భావిస్తారు, ముఖ్యంగా శివునిది. అది ఆయన అపారమైన శక్తికి నిదర్శనం. ఈ కారణం వలన దాన్ని ఎప్పుడూ చల్లబర్చే పాలు, గంధం, బూడిద వంటి వాటితోనే పూజిస్తారు.
కానీ పసుపు స్త్రీ అందాన్ని పెంచే వస్తువు. ఈ భౌతిక అందాలకి దూరంగా ఉండే పరమశివుడు ఒక సన్యాసిగా జీవిస్తారు కాబట్టి పసుపుతో ఎన్నటికీ పూజించబడరు. ఒకవేళ అలా పూజిస్తే ఆ పరమేశ్వరుడు ఆగ్రహానికి లోనవ్వక తప్పదు అంటున్నారు. కాబట్టి శివుడికి పసుపును సమర్పించక పోవడమే మంచిదని చెబుతున్నారు.