Site icon HashtagU Telugu

Underwear : ఇండియన్స్ ఇన్నర్‌వేర్‌లను కొనడం లేదట..వేసుకోవడం మానేశారా ఏంటి..?

Why people of India are not buying underwear

Why people of India are not buying underwear

భారతీయులు ఇన్నర్‌వేర్‌ (Indians Underwear)లను కొనడం లేదట..దీంతో పెద్ద పెద్ద కంపనీలు భారీ నష్టాలూ చవిచూడాల్సి వస్తుందని వారంతా లోబోదిబోమంటున్నారు. వాస్తవానికి భారతీయులు ఇన్నర్‌వేర్‌ వేసుకోవడం..ఈ 50 ఏళ్లలో అలవాటు చేసుకున్నారు కానీ గతంలో ఇన్నర్‌వేర్‌ ఎక్కడివి..

ప్రపంచ దేశాలతో పోల్చితే భారతదేశంలో భిన్న సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు, విభిన్న మతాలు అందరూ కలిసి మెలిసి ఉండే విధానం ఒక్కటేమిటీ ఏ దేశంలో కూడా భారతదేశంలో ఉన్న కట్టుబాట్లు ఎక్కడ లేవనే చెప్పాలి. భారతదేశం (India)లో పుట్టిన చాలా రకాల సంప్రదాయాలు, కట్టుబాట్లను ప్రపంచ దేశాలు అన్ని కూడా పాటిస్తున్నాయి. ఇప్పటికీ మహిళలు చీరలను ధరిస్తూనే.. కొన్ని ఫ్యాషన్ డ్రెస్ లు కొంత మంది మాత్రం ధరిస్తూ ట్రెండ్ సృష్టిస్తున్నారు. పురుషులు కూడా దోవతిని గోచి పెట్టుకునేవారు. పైన షర్ట్ ధరించేవారు. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఆ ఆచారాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ప్రస్తుతం చిన్నపిల్లలు కొంత మంది ఏదైనా ఫంక్షన్ల సమయంలో గోచి వంటి దుస్తులను ధరిస్తున్నారు. చాలా వరకు ఇప్పుడు విదేశీయుల మాయలో పడి చీరలను పక్కకు పెట్టి డ్రెస్ లు ధరిస్తున్నారు.

Read Also : Hyderabad: రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో 15 లక్షలు విలువ చేసే బంగారం సీజ్

తాజాగా భారతీయులు ఇన్నర్‌వేర్‌లను కొనడం చాల తగ్గించారని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. పార్టీ వేర్ నుండి సాధారణ, ఆఫీసు దుస్తులు వరకు అన్ని రకాల బట్టలు, బూట్లు, బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నింటినీ ప్రజలు కొంటున్నారు. కానీ వారి జాబితాలో లోదుస్తులు, ఇన్నర్‌వేర్‌లు ఉండడం లేదని అంటున్నారు. జాకీ, డాలర్‌, రూపా (Jockey, Rupa, Dollar) వంటి ఇన్నర్‌వేర్‌ల సంస్థలు భారీగా నష్టపోతున్నాయట. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రజల వద్ద ఖర్చు చేయడానికి సరిపడా డబ్బు లేకపోవడమే అమ్మకాలు తగ్గడానికి కారణం అయ్యి ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ఎక్కవుగా శాతం ఇండియన్స్ ఆన్‌లైన్ మార్కెటింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆన్‌లైన్ స్టోర్‌లలో ఎక్కువ డిస్కౌంట్లు పొందడమే దీనికి కారణం అని మార్కెట్ విశ్లేషకులు చెపుతున్నారు. మల్టీ బ్రాండ్ ఔట్‌లెట్లు (ఎంబీవో) గతంలో కొనుగోలు చేసినంత స్టాక్‌ను కొనుగోలు చేయడం లేదని స్థానిక దుకాణదారులు చెబుతున్నారు. వారు కొనుగోలు చేసిన వాటికి చెల్లింపులో కూడా జాప్యం చేస్తున్నారు. దీని కారణంగా ప్రొడ్యూసర్స్ వర్కింగ్ క్యాపిటల్ కూడా ప్రభావితమవుతుంది అని అంటున్నారు.

Exit mobile version