Reasons for Going to Temple: గుడికి ఎందుకు వెళ్ళాలి.. దీని వెనుక ఆంతర్యం ఏమిటి?

మనలో చాలామందికీ గుడికి వెళ్లే అలవాటు ఉంటుంది. అందులో కొందరు ప్రతిరోజు గుడికి వెళుతూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - August 4, 2022 / 08:00 PM IST

మనలో చాలామందికీ గుడికి వెళ్లే అలవాటు ఉంటుంది. అందులో కొందరు ప్రతిరోజు గుడికి వెళుతూ ఉంటారు. మరికొందరు మాత్రం పండుగ రోజులు విశేషమైన రోజుల్లో మాత్రమే గుడికి వెళుతూ ఉంటారు. ఇంకొందరు కాలక్షేపం కోసం, మనశ్శాంతి కోసం గుడికి వెళుతూ ఉంటారు. అయితే చాలామంది దేవుడిని నమ్మి దేవాలయాలకు వెళుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం దేవుళ్లను నమ్మరు. ఈ విషయం పక్కన పెడితే అసలు గుడికి ఎందుకు వెళ్లాలి అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? అయితే గుడికి వెళ్లడం అన్నది ఒక మొక్కుబడి వ్యవహారం కాదట. గుళ్లను సందర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయట.. మరి ఆ శాస్త్రీయ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మన దేశంలో చిన్న పెద్ద అంటూ లక్షలాది దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలను భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఈ దేవాలయాలను నిర్మిస్తూ ఉంటారు. ఇంకొంచెం అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అదే విధంగా భూమిలో పాజిటివ్ ఎనర్జీ ప్రసరించే చోట ప్రసిద్ధ దేవాలయాలు ఉంటాయి. అందుకే అటువంటి చోట ఉన్న గుళ్లో అడుగుపెట్టగానే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. దేవాలయ గర్భగుడిలో ఉత్కృష్టమైన ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన చోట మూల విరాట్ నిలిపిన ప్రదేశంలో వేదమంతాలు రాసిన రాగి రేకును నిక్షిప్తం చేసి ఉంచుతారు.

రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉండడంతో ఆ రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. అందువల్ల రోజు గుడికి వెళ్లి మూలవిరాట్ ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడూ ఒకసారి ఆలయానికి వెళ్లే వారికి మాత్రం ఆ శక్తి సోకినా కూడా పెద్దగా తేడా తెలియదు. కానీ ప్రతిరోజు గుడికి వెళ్లే వారికి మాత్రం ఆ పాజిటివ్ ఎనర్జీ చేయడం స్పష్టంగా తెలుస్తుంది. కాగా గర్భగుడి మూడు వైపులా మూసి ఉండి ఒకవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరింత అధికంగా ఉంటుంది.