Site icon HashtagU Telugu

Morning Rooster: ఉదయాన్నే కోడి ఎందుకు కూస్తుంది? దీని వెనుక అసలు రహస్యం ఏంటీ?

Crow

Crow

మాములుగా గ్రామాలలో నివసించే వారికి తెల్లవారు జామున వినిపించే శబ్దం ఏంటంటే కోడి కూత అని వెంటనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆ కూత ద్వారా తెల్లవారైందని అనుకుంటారు. మరి ఆ కోళ్లు కూడా ఉదయాన్నే ఎందుకు కూస్తాయి. ప్రతిరోజు అదే సమయానికే ఎందుకు కూస్తాయి అని చాలా మందికి అనుమానాలు రావచ్చు.

కానీ చాలా వరకు అవి ఉదయాన్నే ఎందుకు కూస్తాయి అనేది తెలీదు. నిజానికి అవి ప్రతి రోజు ఒకే సమయానికి కూయడానికి ఒక రహస్యం ఉంది. ఇంతకూ ఆ రహస్యం ఏంటంటే.. కోడికి మనిషి కంటే 45 నిమిషాల ముందుగానే వెలుతురు చూసే గుణం ఉంటుందట. అందుకే తెల్లవారుజామున 45 నిమిషాల ముందుగానే కోళ్లు క్రమం తప్పకుండా కూత వేయడానికి కారణం అదే అని అంటున్నారు శాస్త్రీయులు.

కానీ దీని వెనుక రహస్యం ఇది అని మనకు తెలియక ఇవి ఉదయాన్నే ఎందుకు కూస్తాయో అని బహుశా వాటికి ఆ సమయంలో మేలుకు రావటమో లేదా ఆకలి వేయటం వల్లనో అవి అలా కూస్తాయి అని అనుకుంటాము. కానీ దీని వెనుక ఉన్న అసలు కారణం ఇదే. మీరు కూడా గ్రామాలలో నివసించినట్లయితే ప్రతిరోజు ఉదయాన్నే ఒక్కసారి కోడికూతను గమనించి చూడండి. అవి కూత కూసిన 45 నిమిషాల తర్వాత తెల్లవారుతుందో లేదో కూడా ఒకసారి గమనించండి.