Depression: యువతలోనే డిప్రెషన్ ఎక్కువట…కారణాలేంటి..?

మనదేశంలో డిప్రెషన్ భారీనపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. సుమారు 15 నుంచి 25ఏండ్ల లోపు ఉన్నవారే ఎక్కువగా డిప్రెషన్ బారిన పడుతున్నారట.

  • Written By:
  • Publish Date - March 5, 2022 / 09:25 AM IST

మనదేశంలో డిప్రెషన్ భారీనపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. సుమారు 15 నుంచి 25ఏండ్ల లోపు ఉన్నవారే ఎక్కువగా డిప్రెషన్ బారిన పడుతున్నారట. ఇంత చిన్నవయస్సులో డిప్రెషన్ లోకి వెళ్లడానికి తల్లిదండ్రులు కూడా ఒక కారణమేనని మానసిక నిపుణులు చెబుతున్నారు. పిల్లల ఫ్యూచర్ బాగుండాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అలా అనుకోవడం వారి మంచికోసమే కదా. కానీ మీ చేతుల్లో ఈ దేశ భవిష్యత్తు ఉందని…మీరే కదా రేపటి తరానికి మర్గదర్శకాలని…పిల్లలు మోయలేని బారాన్ని వారి భుజాలపై మోపుతున్నారు పేరెంట్స్.

మీకు నచ్చిన పని చేయాలనుకోవడం…వారు అందులోనే రాణించాలని కోరుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ముఖ్యంగా పిల్లలు చిన్ననాటి నుంచే వారిపై పేరెంట్స్ కలలను, ఆశయాలను రుద్దుంటారు. దీంతో వారికి ఇష్టమున్న…చేరుకోవాలన్నకున్న ఆశయాలు అడియాశాలుగానే మిగిలిపోతాయి. చిన్నప్పటి నుంచి అవే మాటలు వింటూ పెరిగే పిల్లలకు వారి స్టామినా ఏంటోకూడా తెలియని పరిస్థితులు నెలకొంటాయి. ఇక మన దేశంలో డిప్రెషన్ కు ఎక్కువగా గురయ్యే వారు 15 నుంచి 25ఏండ్ల లోపు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని ఓ సర్వే తేల్చింది. వంద శాతంలో 20శాతం యువత డిప్రెషన్ లోకి వెళ్తున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. వీరిలో తాము కన్న కలలు..కెరియర్ లేదని డిప్రెషన్ లోకి వెళ్లిన వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారట.

కారణాలు…
* డిప్రెషన్ లోకి వెళ్లడానికి ముఖ్యమైన కారణాలు చాలానే ఉన్నాయి. అందులో ముందుగా పిల్లలకు నచ్చిన చదువును చదివించకపోవడం, నువ్వు ఇదే చదవాలి…నీకు ఈ గ్రూపే బాగుంటుంది…ఇలా నానా రకాలుగా వారిని ఇబ్బందులకు గురి చేయడంతో వారిలో డిప్రెషన్ పెరిగిపోతోంది.

* పిల్లల ఇష్టాఇష్టాలను తెలుసుకోకుండా ఒత్తిడి తెస్తే వారు మరింత మానసికంగా కుంగిపోతారని అధ్యయనాల్లో తేలింది. పిల్లలపై పేరెంట్స్ ఇష్టా ఇష్టాలును రుద్దడం వల్ల వారు ఏం చేయాలన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నారట.

* ఇదే విషయం ఎక్కువగా ఆలోచిస్తూ…నాకు నచ్చింది చేయాలా లేదా వాళ్లు చెప్పింది చేయాలా..అసలు నేనేం చేయాలి…ఏది చేస్తే బాగుంటుంది..ఇలాంటి విషయాలు విపరీతంగా ఆలోచించడం వల్లే యూత్ డిప్రెషన్ లోకి వెళ్తున్నారని సర్వేలు తేల్చి చెబుతున్నాయి.

* మరో కారణంగా కూడా డిప్రెషన్ లోకి వెళ్లేందుకు కారణం అవుతుంది. అదే ప్రేమలో విఫలం అవ్వడం. దీని కారణంగా చాలామంది ఒత్తిడికి లోనవుతున్నారు. తెలిసి తెలియని వయస్సులో ప్రేమలో పడటం, ఏవో కారణాలతో విడిపోవడం…డిప్రెషన్ లోకి వెళ్లడం…కారణాలు ఏవైనా కావొచ్చు…డిప్రెషన్ లో ఉన్నవారిని గుర్తించి వారితో మాట్లాడుతే…వారు బాధలో నుంచి కొలుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే వారు మామూలు మనుషులుగా మారుతారు. ముఖ్యంగా పేరెంట్స్ …మీకు నచ్చడం చేయడం కంటే..పిల్లలకు నచ్చిన విషయాల్లో ప్రోత్సహించండి. అప్పుడు వారు భవిష్యత్తు బంగారంలా ఉంటుంది.