Site icon HashtagU Telugu

Flies: ఈగలు మనుషులపై ఎందుకు వాలుతాయో మీకు తెలుసా?

Flies

Flies

సాధారణంగా ఇంట్లో బయట, మురికి ప్రదేశాలలో, తీపి లాంటి పదార్థాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఈగలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సార్లు ఈగలు మరింత ఎక్కువ అయ్యే మనుషులకు చికాకు కూడా తెప్పిస్తూ ఉంటాయి. ఆహార పదార్థాల మీద వాడడంతో పాటు మనుషుల మీద కూడా వాలుతూ ఉంటాయి. ఇక పల్లెటూర్లలో ఈగలు మనకు మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈగలు మనుషుల చుట్టూ ఎందుకు తిరుగుతాయి? ఇళ్లలోకి ఎందుకు వస్తాయి? వాటిని ఎలా వదిలించుకోవాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మామూలుగా మన ఇళ్లలో కనిపించే ఈగలు 10 నుంచే కేవలం 25 రోజులు మాత్రమే జీవిస్తాయి. పై పగటి పూట ఎక్కువగా సంచరిస్తూ నేల, గోడ,సీలింగ్ ఫ్యాన్, కిటికీల వంటి వాటిని ఆవాసంగా చేసుకుంటాయి. ముఖ్యంగా కిటికీల దగ్గర వాటికి కావాల్సినంత వెచ్చదనం లభిస్తుంది. అందుకే అవి కిటికీల వద్ద ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతాయి. అంతేకాకుండా ఈగలు నిద్రపోతాయి. అందుకోసం నేల, మొక్కలు,కంచె తీగలు, చెత్త డబ్బాలను నిద్ర కోసం ఎంచుకుంటాయి. వాటిని వాతావరణం ఎక్కువగానూ ఉండకూడదు అలా అని తక్కువగా కూడా ఉండకూడదు. అంటార్కిటికా ప్రదేశాలలో చలి చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశాలలో ఈగలు దాదాపుగా కనిపించవు.

కాగా ఈగలు ఎక్కువగా మురికిని ఇష్టపడతాయి. తీపి పదార్థాలు అంటే కూడా వాటికి బాగా ఇష్టం. మనుషుల చర్మంపై కొంత నూనె ఉప్పు మృత కణాలు ఉంటాయి. ఈగలు కేవలం ఇళ్ళలో కనిపించే ఆహారం మాత్రమే కాకుండా మానవ శరీరంపై ఉండే కంటికి కనిపించని వ్యర్ధాలు కూడా వాటికి ఆహారమే. అందుకే మనుషులపై ఈగలు వాలుతూ ఉంటాయి. ఇక మనుషులు కొట్టడానికి ప్రయత్నించినప్పుడు సులభంగా తప్పించుకుంటాయి.