మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే సందేహం ఇంకా కొనసాగుతానే ఉంది. శనివారం విడుదలైన అసెంబ్లీ ఫలితాల్లో, బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 స్థానాల్లో 233 సీట్లు గెలుచుకుంది. ఇందులో బీజేపీ 132 సీట్లు సాధించి, మహారాష్ట్రలో మరోసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయినప్పటికీ, ఫలితాలు వచ్చి నాలుగు రోజులు గడుస్తున్నా, కొత్త సీఎం ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు.
బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు శివసేన చీఫ్, మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే సీఎం రేసులో ముందున్నారు. తాజా సమాచారం ప్రకారం, మహాయుతి కూటమికి చెందిన ముగ్గురు నేతలు రేపు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ భేటీ అనంతరం, సీఎం నియామకంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు మహాయుతి నేతలు వెల్లడించారు.
బీజేపీ, దేవేంద్ర ఫడ్నవీస్‌కు సీఎం పదవి ఇవ్వాలని భావిస్తుండగా, మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే తనకు ఈ అవకాశాన్ని ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం.