Site icon HashtagU Telugu

WHO: గుడ్ న్యూస్.. ఒమిక్రాన్ లో స్వల్ప లక్షణాలే!

Template (16) Copy

Template (16) Copy

కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ లో స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) తెలియజేసింది. ఒమిక్రాన్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ (శ్వాస వ్యవస్థలో ఎగువ భాగం) పైనే ప్రభావం చూపిస్తోందని.. గత వేరియెంట్ లతో పోలిస్తే స్వల్ప లక్షణాలనే కలిగిస్తోంది. దాని ఫలితంగానే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాల రేటు తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఇతర కరోనా రకాలతో ఊపిరితిత్తుల్లో తీవ్రస్థాయిలో న్యూమోనియా ఏర్పడేది కానీ ఓమిక్రాన్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కు మాత్రమే పరిమితం అవుతోందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. ఇది నిజంగా శుభవార్తే. కానీ, దీన్ని నిర్ధారించేందుకు మరిన్ని అధ్యయనాలు జరగాల్సి ఉందని.. ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందే ఒమిక్రాన్ తో వారాల వ్యవధిలోనే భారీ కేసులు రావచ్చని, అప్పుడు వైద్య సదుపాయాలు రిస్క్ లో పడతాయని ప్రభుత్వాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

Exit mobile version