Site icon HashtagU Telugu

హు కిల్డ్‌ కట్టప్ప.. ఆర్జీవి మరో ఆసక్తికర ట్వీట్!

Ram Gopal Varma 1554574306 Imresizer

Ram Gopal Varma 1554574306 Imresizer

నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే రాంగోపాల్ వర్మ సినిమా టికెట్ల విషయపై ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవాలనేది పూర్తిగా నిర్మాతల, యజమాన్యాలకు సంబంధించినదనీ, మధ్యలో ప్రభుత్వం పెత్తనం ఏంటి? అని ప్రశ్నించారు. వైసీపీ మంత్రి పేర్నినాని తో భేటీ అయిన సమస్య కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో వర్మ మరో ట్వీట్ చేశారు. ‘‘మహారాష్ట్రలో ఆర్‌ఆర్‌ఆర్‌ టికెట్‌ ధర రూ.2200. ఏపీలో రూ.200కు కూడా అనుమతి లేదు. హు కిల్డ్‌ కట్టప్ప’’ ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌ వర్మ పోస్ట్ చేశారు.