Telegram CEO Arrested: టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ వ్యవస్థాపకుడు, CEO అయిన బిలియనీర్ పావెల్ దురోవ్ (39) ఆగస్టు 24 సాయంత్రం పారిస్ వెలుపల ఉన్న బోర్గెట్ విమానాశ్రయంలో అరెస్టు (Telegram CEO Arrested) చేశారు పోలీసులు. CNN నివేదిక ప్రకారం.. దురోవ్ తన ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్నాడు. అతను అజర్‌బైజాన్ నుండి విమానంలో బోర్గెట్ విమానాశ్రయానికి చేరుకున్నాడు.
BFMTV ప్రకారం.. ఫ్రెంచ్ కస్టమ్స్ యాంటీ-ఫ్రాడ్ కార్యాలయం నుండి అధికారులు పావెల్‌ను అరెస్టు చేశారు. టెలిగ్రామ్‌లో మనీలాండరింగ్, డ్రగ్స్ స్మగ్లింగ్, పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను షేర్ చేయడాన్ని ఆపడంలో విఫలమవడమే అతని అరెస్టుకు కారణమని సమాచారం. కంటెంట్ నియంత్రించబడనందుకు పావెల్ దురోవ్‌పై అరెస్ట్ వారెంట్లు జారీ చేయబడ్డాయి. BFMTV ప్రకారం.. అరెస్ట్ వారెంట్ జారీ అయినప్పటి నుండి దురోవ్ ఫ్రాన్స్, యూరప్‌కు వెళ్లలేదు.
Also Read: Bone Density: ఎముకలను బలహీనపరిచే ఆహార పదార్థాలివే.. వీటికి దూరంగా ఉండటమే బెటర్..!
పావెల్ దురోవ్ అరెస్టుకు కారణం
టెలిగ్రామ్ యాప్‌లో మోడరేటర్ల కొరతకు సంబంధించిన విషయం. దీనిపై ఫ్రాన్స్ పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోడరేటర్లు లేకపోవడంతో టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో ఎలాంటి ఆటంకం లేకుండా నేర కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పోలీసుల ఆరోపణ.
పావెల్ దురోవ్ ఎవరు?
పావెల్ దురోవ్ రష్యాలో జన్మించిన వ్యాపారవేత్త. దుబాయ్‌లో ఉన్న పావెల్ 2014లో రష్యాను విడిచిపెట్టాడు. 2022లో అతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో అత్యంత ధనిక ప్రవాసిగా గుర్తింపు పొందాడు. అతని మొత్తం సంపద గురించి మాట్లాడుకుంటే.. ఫోర్బ్స్ ప్రకారం దురోవ్ మొత్తం ఆస్తుల విలువ $15.5 బిలియన్లు. టెలిగ్రామ్ కూడా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్రసిద్ధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌గా మారింది. 2013లో ప్రారంభించబడిన టెలిగ్రామ్ నేడు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు గట్టి పోటీనిస్తోంది. వచ్చే ఏడాది వందకోట్ల మంది వినియోగదారులను చేరుకోవడం టెలిగ్రామ్ లక్ష్యం.
We’re now on WhatsApp. Click to Join.
39 ఏళ్ల దురోవ్ రష్యాలో జన్మించాడు. అతను మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, యజమాని. టెలిగ్రామ్ అనేది ఉచిత సోషల్ నెట్‌వర్కింగ్ యాప్. దీనిని ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. Facebook, YouTube, WhatsApp, Instagram, TikTok, WeChat ఉన్నప్పటికీ టెలిగ్రామ్‌కు చాలా గుర్తింపు వచ్చింది. ఈ యాప్‌కు ప్రస్తుతం 900 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. 2024-25 సంవత్సరంలో ఒక బిలియన్ యాప్ వినియోగదారులను చేరుకోవడం కంపెనీ లక్ష్యం. టెలిగ్రామ్ దాని ప్రధాన కార్యాలయం దుబాయ్‌లో ఉంది. దురోవ్ 2014లో రష్యాను విడిచిపెట్టి దుబాయ్‌కు వచ్చాడు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. దురోవ్ ప్రస్తుతం మొత్తం సంపద $ 15.5 బిలియన్లు.