Kerala Murders: కేరళ నరబలి: హింసలో కూడా ఆనందాన్ని వెతుక్కున్న మానవ మృగం!

కేరళలో తాజాగా నరబలి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనతో కేరళ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం

Published By: HashtagU Telugu Desk
Kerala

Kerala

కేరళలో తాజాగా నరబలి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనతో కేరళ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ కేరళ నరబలి గురించే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నరబలి కేసులో భాగంగా ఇద్దరు దంపతులను హత్య చేసిన వ్యక్తిగా మహమ్మద్ షఫీ అనే మంత్రగాడు పై కేసు నమోదు అయింది. కాగా ఈ నరబలి కీ మాస్టర్ మైండ్ మహమ్మద్ షఫీ ని అని చెప్పవచ్చు. ఆ నరబలి కేసులో బలి అయిన ఆ దంపతుల మూడవ విశ్వాసాలను ఆసరాగా తీసుకొని వారి కామెచ్చను తీర్చుకోవడంతోపాటు హింసలో కూడా ఆనందాన్ని వెతుక్కున్నాడు.

అలా వారిని బ్లాక్ మెయిల్ చేస్తూనే దంపతులనుంచి డబ్బును కూడా రాబట్టుకున్నాడు. చనిపోయిన ఆ దంపతులిద్దరూ కూడా సామాన్యంగా కనిపించిన వారే. దంపతులు వారి తండ్రి నుంచి అందిపుచ్చుకున్న సాంప్రదాయ మసాజ్ వృత్తి తోనే జీవిస్తున్నారు. అయితే ఈ కేరళ నరబలి ఘటనకు సూత్రధారి మహమ్మద్ షఫీ. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహమ్మద్ షఫీ పై 2006 నుంచి 2020 వరకు చాలా కేసులు నమోదు అయ్యాయట. షఫీ లైంగిక విపరీత ధోరణి కలవాడని, హింసతో సంతృప్తిని పొందే మనిషి అని పోలీసులు తెలిపారు.

అంతే కాకుండా మహిళలపై అనేక రీతుల్లో ఉన్మాద రీతులు లైంగిక చర్యలు చేశాడని, ఇటువంటి నర బలుల కోసమే పలువురికి మహిళలను సప్లై కూడా చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ నరబలుల కేసులు సంబంధించినవి కాకుండా అదనంగా 8 కేసులు షఫీపై ఉన్నట్టు డీసీపీ చెప్పుకొచ్చారు. షఫీ లైంగిక ఉన్మాది సైకో కిల్లర్ అని పోలీస్ చీఫ్ సిహెచ్ నాగరాజు తెలిపారు. స్కూల్ డ్రాప్ అవుట్ అయినా షఫీ హింసతోనే ఆనందాన్ని వెతికే ఒక సైకో అని ఆయన తెలిపారు. గతంలో కూడా ఇలాగే 75 ఏళ్ల మహిళపై అత్యాచారం, హత్య ప్రయత్నం కింద కేసు నమోదు అయిందని, షఫీ ఇతరులకు హానితలపెట్టడం చంపి అయినా సరే చాలా ఇష్టపడే మనస్తత్వం షఫీ ది అని తెలిపారు.

  Last Updated: 13 Oct 2022, 07:54 AM IST