తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Telugu States) కీలకంగా నిలిచిన ఇద్దరు ప్రముఖులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ (CBN & KCR). ఈ ఇద్దరూ తాము ఎదుర్కొన్న కష్టాలను అధిగమించి అధికారంలోకి వచ్చారు. కానీ నాయకత్వ శైలి, ప్రజలతో జరిపే సంబంధాలు, పరిపాలనా విధానాలు పరంగా చూస్తే మాత్రం చంద్రబాబు తక్కువవారే కాదనిపిస్తుంది. కేసీఆర్ ఒక్కసారి ఓడిపోతేనే రాజకీయ వేదిక నుంచి తప్పుకొని ఫామ్‌హౌస్‌కు పరిమితం అయ్యారు. కానీ చంద్రబాబు రాజకీయాల్లో పోరాట యోధుడిగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రతిసారి ప్రజల సపోర్టుతో మళ్లీ పార్టీని నిలబెట్టి ముందుకు తీసుకెళ్లారు.
US-China trade war: అమెరికాకు తలవచ్చిన చైనా..! ప్రతీకార సుంకాలపై ట్రంప్‌నకు కీలక విజ్ఞప్తి
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజల సమస్యలపై స్పందిస్తూ వారిని కలుస్తుంటారు. కానీ కేసీఆర్ అధికారంలో లేనప్పుడు బయటకే రావడం ఇష్టపడరు. పార్టీ శ్రేణులు, నాయకత్వం క్షీణించినా వారిని మోటివేట్ చేయడంలో చంద్రబాబు ముందు ఉంటారు. కేసీఆర్ మాత్రం తన నాయకత్వానికే అతీతంగా వ్యవహరిస్తూ ఎవరినీ కలవకుండా యాగాల్లో నిమగ్నమవుతారు. నేషనల్ పొలిటిక్స్‌లో కూడా చంద్రబాబు మౌనంగా కానీ ప్రభావవంతంగా పాత్ర పోషించగా, కేసీఆర్ హడావుడి చేసి చివరికి ఒంటరిగా మిగిలిపోయారు.
ఇక అభివృద్ధి పరంగా చూస్తే… చంద్రబాబు కేంద్రంతో అవసరమైతే తగాదా పడతారు, అవసరమైతే కలిసిపోతారు. రాష్ట్ర అభివృద్ధే తన లక్ష్యంగా చురుకుగా వ్యవహరిస్తారు. కానీ కేసీఆర్ మాత్రం కేంద్రాన్ని విమర్శిస్తూ, రాజకీయ రుగ్మతలతో తన రాష్ట్రాన్ని కూడా నష్టపరిచారు. చంద్రబాబు రాజకీయంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ప్రత్యర్థులను ఓడిస్తుంటారు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు కూడా చంద్రబాబుని స్పూర్తిగా చూస్తున్న ఈ రోజుల్లో, కేసీఆర్ మాదిరిగా అహంభావంతో వ్యవహరించడం తప్పని విశ్లేషకుల అభిప్రాయం. కనుక సమగ్రంగా చూస్తే నాయకత్వ శైలి, ప్రజల పట్ల బాధ్యత, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి వంటి అంశాల్లో చంద్రబాబు కొంచెం బెటర్ అని చెప్పచ్చు.