Who Is Monu Manesar : హర్యానాలోని నూహ్ లో అల్లర్లు.. మోనూ మానేసర్ పైనే చర్చ.. ఎవరతడు ?

Who Is Monu Manesar : హర్యానాలోని నూహ్ జిల్లా ఉద్రిక్తతతో అట్టుడుకుతోంది..అక్కడ ఇప్పుడు కర్ఫ్యూ అమల్లో ఉంది. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) శోభాయాత్రపై  సోమవారం మధ్యాహ్నం కొందరు రాళ్లు రువ్వడంతో ఈ ఘర్షణ మొదలైందని అంటున్నారు.

  • Written By:
  • Updated On - August 1, 2023 / 02:23 PM IST

Who Is Monu Manesar : హర్యానాలోని నూహ్ జిల్లా ఉద్రిక్తతతో అట్టుడుకుతోంది..అక్కడ ఇప్పుడు కర్ఫ్యూ అమల్లో ఉంది. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) శోభాయాత్రపై  సోమవారం మధ్యాహ్నం కొందరు రాళ్లు రువ్వడంతో ఈ ఘర్షణ మొదలైందని అంటున్నారు. అయితే నూహ్ జిల్లాలోకి శోభా యాత్ర ఎంటర్ కావడానికి ఒకరోజు ముందు (ఆదివారం) అక్కడి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ సర్క్యులేట్ అయింది. రేపు (సోమవారం) జరిగే శోభా యాత్రలో బజరంగ్ దళ్ నేత, వివాదాస్పద గో సంరక్షకుడు  మోనూ మానేసర్  కూడా పాల్గొంటారనేది ఆ పోస్ట్ ల సారాంశం. దీనికి ప్రతిగా సోషల్ మీడియాలో ఇంకొందరు పోస్టులు పెడుతూ..  మోనూ మానేసర్  సిటీలోకి ఎంటర్ అయితే ఊరుకోము అని హెచ్చరించారు. ఈనేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి నూహ్ జిల్లాలోకి శోభా యాత్ర ఎంటర్ అయిన చోటుకు ఓ వర్గానికి చెందిన పలువురు చేరుకొని ఘర్షణకు దిగుతారు.. ఈవిధంగా పరోక్షంగా ఉద్రిక్తతలకు దారితీసిన మోనూ మానేసర్  ఎవరు ? ఇప్పుడు తెలుసుకుందాం..

Also read : Petrol Diesel Price Hike: లీటర్ పెట్రోల్ ధర రూ.272, డీజిల్ ధర రూ.273.. ఎక్కడంటే..?

ఫిబ్రవరి 16 జునైద్, నాసిర్ హత్య కేసులో.. 

మోనూ మానేసర్ బజరంగ్ దళ్ సభ్యుడు.  అతడు హర్యానాలో బజరంగ్ దళ్ యొక్క గో సంరక్షణ విభాగం చీఫ్ గా వ్యవహరించేవాడు. బజరంగ్ దళ్ నూహ్ జిల్లా కన్వీనర్ గానూ  పని చేసేవాడు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గో సంరక్షణ టాస్క్ ఫోర్స్ లో కూడా అతడు కీలక పాత్ర పోషించేవాడు. అయితే హర్యానా రాష్ట్రంలోని భివానీ జిల్లాలో ఈఏడాది ఫిబ్రవరి 16న గోవులను అక్రమంగా  తరలిస్తున్నారనే కారణంతో జునైద్ (35), నాసిర్ (25) అనే ఇద్దరు యువకుల హత్య జరిగింది. మహీంద్రా  బొలెరో వాహనంలో సజీవ దహనమైన స్థితిలో వారి డెడ్ బాడీస్ పోలీసులకు దొరికాయి. జునైద్, నాసిర్ ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీసులకు చేసిన ఫిర్యాదులో..  వారిద్దరిని  మోనూ మానేసర్ కిడ్నాప్ చేసి హత్య చేశాడని ఆరోపించారు.

Also read : TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు!

ఆనాటి నుంచి పరారీలోనే.. 

ఆనాటి నుంచి మోనూ మానేసర్(Who Is Monu Manesar)  పరారీలోనే ఉన్నాడు. దీంతో పోలీసులు జునైద్, నాసిర్ ల హత్య కేసులో మోనూ మానేసర్ ను ప్రధాన అనుమానితుడు, ప్రధాన నిందితుడిగా చేర్చి ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు.  ఈ విధంగా పరారీలో ఉన్న మోనూ మానేసర్ నూహ్ జిల్లాలోకి వస్తున్నాడని తెలియడంతో ఓ వర్గానికి చెందిన కొందరు వీహెచ్ పీ శోభాయాత్రను అడ్డుకోవడంతో తాజా గొడవలకు దారితీసింది. ఈ గొడవల్లో ఇప్పటివరకు ఐదుగురు మరణించగా, 200 మందికి గాయాలయ్యాయని హిందూస్తాన్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. చనిపోయిన వారిలో ఇద్దరు పోలీస్ హోం  గార్డులు కూడా ఉన్నారని తెలిపింది. కాగా, మోనూ మానేసర్ ఒక యూట్యూబ్ ఛానల్ ను నడిపేవాడు. అందులో గోవులను స్మగ్లింగ్ నుంచి రక్షించే వీడియోలను పోస్ట్ చేసేవాడు. ఆ ఛానల్ ను అనతికాలంలోనే 1 లక్షమందికి పైగా సబ్ స్క్రైబ్ చేశారు. అతడికి యూట్యూబ్  నుంచి 2022 అక్టోబర్ లో సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది. ఆ తర్వాత వివిధ కారణాలతో ఆ ఛానల్ ఆగిపోయింది.