మంకీపాక్స్‌ను గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 70 కంటే ఎక్కువ దేశాలలో విస్తరిస్తున్నందును WHO ఈ ప్రకటనను వెలువరిచింది. ఇప్పటి వరకు కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తే.. తాజాగా మంకీపాక్స్ మళ్లీ ప్రపంచ దేశాల్ని భయపెడుతోంది. మంకీపాక్స్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 16వేల మంకీపాక్స్ కేసులు నమోదైయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మంకీపాక్స్ వల్ల మరణాలు తక్కువగానే నమోదవుతున్నప్పటికీ వ్యాధి వ్యాప్లి ఎక్కువ అవుతుండటంతో WHO అలర్ట్ అయింది. శనివారం WHO చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ శనివారం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మంకీపాక్స్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించారు. కోవిడ్-19 మహమ్మారి, 2014 వెస్ట్ ఆఫ్రికన్ ఎబోలా వ్యాప్తి, 2016లో లాటిన్ అమెరికాలో జికా వైరస్ మరియు పోలియో నిర్మూలనకు కొనసాగుతున్న ప్రయత్నం వంటి ప్రజారోగ్య సమస్యల కోసం WHO గతంలో అత్యవసర పరిస్థితులను ప్రకటించింది. ఇప్పటి వరకు భారతదేశంలో మూడు మంకీపాక్స్ కేసులు నమోదైయ్యాయి. ఈ మూడు కేసులు కూడా కేరళలో నమోదయ్యాయి.
Monkeypox : గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా మంకీపాక్స్…!

monkeypox