Site icon HashtagU Telugu

Rahul Gandhi: అదానీ షెల్ కంపెనీల్లో ఉన్న బినామీ ఆస్తులు ఎవరివి, బీజేపీ సమాధానం చెప్పాల్సిందే!

Did Rahul Commit A Crime More Than The Leaders Of Telugu States..

Did Rahul Commit A Crime More Than The Leaders Of Telugu States..

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దూకుడు పెంచారు. అదానీ అంశంపై మరోసారి బీజేపీని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు సంధించారు. న్యాయవ్యవస్థపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోందన్న బీజేపీ ఆరోపణలపై రాహుల్ గాంధీ స్పందించారు. అదానీ షెల్ కంపెనీల్లో రూ. 20వేలకోట్ల బినామీ ఆస్తులు ఎవరికి ఉన్నాయో ముందుగా బీజేపీ సమాధానం చెప్పాలన్నారు.

ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న వెంటనే, నిన్న సూరత్ కోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై కొందరు జర్నలిస్టులు ప్రశ్నించారు. న్యాయవ్యవస్థపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోందని బీజేపీ చెబుతోందని జర్నలిస్టు  ప్రశ్న విన్న రాహుల్ గాంధీ ..ఎప్పుడూ బీజేపీ గురించి ఎందుకు మాట్లాడుతారని అన్నారు.