Site icon HashtagU Telugu

66 Kids Dead: గాంబియాలో 66 మంది చిన్నారులు మృతి.. ఆ సంస్థకు WHO వార్నింగ్.!

Cough Syrups

Coupf Syrup

ఓ భారతీయ కంపెనీ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్‌లపై హెచ్చరికలు జారీ చేసింది. గాంబియాలో 66 మంది పిల్లలు మరణించిన తర్వాత డబ్ల్యూహెచ్‌ఓ వైద్య ఉత్పత్తుల హెచ్చరికను జారీ చేసింది. హర్యానాలోని మైడెన్ ఫార్మాస్యూటికల్స్ ఆఫ్ ఇండియా తయారు చేసిన దగ్గు, జలుబు సిరప్‌ల వ‌ల‌న ప్రాణాల‌కు ప్ర‌మాదం ఉంద‌ని WHO తెలిపింది. “దయచేసి వాటిని ఉపయోగించవద్దు” అని WHO పేర్కొంది.

గాంబియాలో 66 మంది పిల్లల మరణాలకు కారణమైన నాలుగు దగ్గు, జలుబు సిరప్‌లు ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్‌మలిన్ బేబీ దగ్గు సిరప్, మాకోఫ్ బేబీ కఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్. ఈ ఉత్పత్తుల భద్రత, నాణ్యతపై భారతీయ కంపెనీ ఇంకా హామీలు ఇవ్వలేదని WHO ఒక ప్రకటనలో తెలిపింది.

నాలుగు ఉత్పత్తుల నుంచి నమూనాలు ప్రయోగాశాలలో పరీక్షిస్తే.. డైథలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్‌లో ఆమోదయోగ్యం లేని పదార్థాలు కలిగి ఉందని నిర్ధారిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గాంబియాలో గుర్తించిన నాలుగు కలుషిత ఔషధాల అంశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ఇది మూత్రపిండాలను పాడుచేస్తుంది.

ఇప్పటివరకు ఈ కలుషితమైన ఉత్పత్తులు గాంబియాలో మాత్రమే కనుగొనబడినప్పటికీ, అవి ఇతర దేశాలకు పంపిణీ చేయబడి ఉండవచ్చు అని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ బుధవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. భారతదేశంలోని మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేసే దగ్గు, జలుబు సిరప్‌లపై విచారణ సాగుతోంది. ఈ ఉత్పత్తులు గుర్తించి సరఫరా ఆపేయాలని ప్రపంచ ఆరోగ్యం సంస్థ సిఫార్సు చేసింది.