Site icon HashtagU Telugu

White House-White Powder : వైట్ హౌస్ లో కొకైన్.. ప్రెసిడెంట్ బైడెన్ కొడుకుపై అనుమానాలు ?

White House White Powder

White House White Powder

White House-White Powder : సాక్షాత్తు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఉండే వైట్ హౌస్ లో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. 

జో బైడెన్ లేని టైంలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వైట్ హౌస్ లో జరిపిన తనిఖీల్లో ఒకచోట  వైట్ పౌడర్ ను గుర్తించారు.

అనంతరం దాన్ని పరీక్షించగా.. ఆ పౌడర్ కొకైన్ అని తేలింది. 

దీంతో వైట్ హౌస్ లోకి కొకైన్ ఎలా వచ్చింది ? ఎవరు తెచ్చారు ? అనేది తెలుసుకోవడంపై సీక్రెట్ సర్వీస్ ఫోకస్ పెట్టింది. 

వైట్ హౌస్ పశ్చిమ భాగంలోని ‘వర్క్ ఏరియా’లో ఉండే లైబ్రరీకి దగ్గర్లో  కొకైన్ ను(White House-White Powder) గుర్తించారు.  వైట్ హౌస్ లైబ్రరీని ప్రతిరోజూ వందలాది మంది సందర్శిస్తుంటారు. సందర్శకుల్లో  ఎవరో ఒకరు కొకైన్ ను అక్కడ పెట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్, సందర్శకుల వివరాల ఆధారంగా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు ఓ వర్గం మీడియా ప్రెసిడెంట్ జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ను టార్గెట్ గా చేసుకుంది. “ప్రెసిడెంట్ బైడెన్ కొడుకే ఈ వైట్ పౌడర్ కు మూలం”  అని సోషల్ మీడియాలో కొందరు పెట్టిన  వివాదాస్పద కామెంట్స్ పై వార్తలను ప్రసారం చేస్తున్నాయి. జో బైడెన్ ప్రస్తుతం అమెరికాలోని మేరీ లాండ్ లో ఉన్న క్యాంప్ డేవిడ్‌ లో ఉన్నారు.  జులై 4న బైడెన్ దంపతులు వైట్ హౌస్ నుంచి క్యాంప్ డేవిడ్‌ కు బయలుదేరి వెళ్ళేటప్పుడు వారితో హంటర్ బైడెన్ (52) కూడా ఉన్నారని అంటున్నారు.

Also read : OnePlus Nord 3 5G: వన్‌ప్లస్ నుంచి మరో 5జీ స్మార్ట్ ఫోన్.. స్పెసిఫికేషన్‌లు ఇవే..!

వైట్ హౌస్ లో డ్రగ్స్ వాడిన ప్రముఖులు 

  • గతంలో వైట్ హౌస్ లో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన ప్రముఖుల లిస్టులో అమెరికన్ రాపర్  స్నూప్ డాగ్,  విల్లీ నెల్సన్, గ్యారీ మెక్‌లైన్, ఎర్కాన్ ముస్తఫా ఉన్నారు.