Site icon HashtagU Telugu

HR Job: ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ చేస్తుండగా.. హెఆర్ ఉద్యోగం ఊడింది!

Whatsapp Image 2023 01 27 At 20.15.53

Whatsapp Image 2023 01 27 At 20.15.53

HR Job: ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల ఉద్యోగాలు ఊడుతుండటం తెలిసిందే. టెక్ కంపెనీలు వ్యయాన్ని తగ్గించుకోవడానికి భారీస్థాయిలో ఉద్యోగులను ఇళ్లకు పంపిస్తున్నాయి. గూగుల్ తో సహా పలు టెక్ కంపెనీలు లేఆఫ్ లకు తెర తీయగా.. దాదాపు 12000 వేల మంది ఉద్యోగాలు ఈ లేఆఫ్ కారణంగా పోయాయి. అయితే గూగుల్ ఒకేసారి తమ కంపెనీలో పని చేస్తున్న భార్యాభర్తలను తీసివేసి షాక్ ఇచ్చిన విషయం నెట్టింట వైరల్ అయింది.

తాజాగా గూగుల్ లేఆఫ్ లో భాగంగా ఓ హెచ్ఆర్ డిపార్ట్ మెంట్ ఉద్యోగి ఉద్యోగం ఊడిన విధానం నెట్టింట వైరల్ అవుతోంది. గూగుల్ కోసం ఉద్యోగార్థులను ఇంటర్య్వూ చేస్తున్న సమయంలో.. ఆ ఇంటర్వ్యూ చేస్తున్న హెచ్ఆర్ ఉద్యోగం ఊడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. గూగుల్ లేఆఫ్ లో భాగంగా తాజాగా ఉద్యోగం పోగొట్టుకున్న సదరు హెచ్ఆర్ పేరు డాన్ లానిగాన్ ర్యాన్ గా తెలుస్తోంది.

గూగుల్ లో కొత్త ఉద్యోగులను తీసుకునే పనని హెచ్ఆర్ డాన్ లానిగాన్ ర్యాన్ చేస్తుండగా.. ఫోన్ లో డాన్ ఒకరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అంతలోనే తాను మాట్లాడుతున్న కాల్ ఒక్కసారిగా కట్ అయింది. దీంతో ఖంగుతిన్న హెచ్ఆర్ డాన్ లానిగాన్ ర్యాన్.. బహుశా సాంకేతిక సమస్య తలెత్తిందేమో అని అనుమానించారు. అసలేం జరిగిందో తెలియక ఆందోళన చెందారు.

తర్వాత అనుమానం వచ్చి గూగుల్ కి చెందిన వెబ్ సైట్ లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించారు. కానీ ఎంతకీ డాన్ లాగిన్ కాలేకపోయారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా లాగిన్ కాకపోగా.. కాసేపటికి ఈ-మెయిల్ ద్వారా లేఆఫ్ మెసేజ్ వచ్చింది. ఈమధ్యనే మరో ఏడాది కాంట్రాక్టును పొడిగించారని, జీతం గురించి చర్చలు కూడా జరిగాయని, కానీ ఇంతలోనే తనకు ఇలా జరిగిందని ర్యాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version