Site icon HashtagU Telugu

Gold: మన దేశంలో బంగారం అతి తక్కువ ధరకు ఎక్కడ లభిస్తుందో తెలుసా?

Gold Price

Gold Price

భారతదేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఏ రేంజ్ లో ఉన్నాయో మనందరికీ తెలిసిందే. రోజురోజుకీ బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. ఒకప్పుడు భారతదేశంలో బంగారు కేవలం 25 వేల నుంచి 30 వేల వరకు ఉండేది. కానీ ప్రస్తుతం బంగారం ధర తులం 50 నుంచి 60 వేల వరకు పలుకుతోంది. దీంతో మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలి అంటేనే భయపడిపోతున్నారు. బంగారం అంటే బాబోయ్ బంగారమా అని షాక్ అవుతున్నారు. దీంతో బంగారం పది రూపాయల తక్కువ అని తెలిసినా కూడా వేరే చోటికి వెళ్లి మరీ బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు.

అది భారతదేశంలోని రాష్ట్రాలలో బంగారం ఏ రాష్ట్రాలలో ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ బంగారం ధర దాదాపుగా ఒకటే ఉంటుంది. కానీ స్థానిక పన్నులు అదేవిధంగా నగల వర్తకుల కమిషన్లు బట్టి నగలధర ఆడుతూ ఉంటుంది. మన దేశ వ్యాప్తంగా అత్యధికంగా బంగారం ఉపయోగించే రాష్ట్రాలలో కేరళ మొదటి స్థానంలో ఉంది. కేరళ తర్వాత మన దేశంలో అత్యధికంగా బంగారం వాడే రాష్ట్రం తమిళనాడు ఆ తర్వాత కర్ణాటక ఉంది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలన్నింటితో పోల్చుకుంటే కేరళ రాష్ట్రంలో బంగారం ధర కాస్త తక్కువగా ఉంటుంది.

కేరళ తర్వాత తమిళనాడు చెన్నైలో బంగారం ధర తక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రొద్దుటూరు ప్రాంతలో కూడా బంగారు నగలకు చాలా ప్రసిద్ధి. బయట మార్కెట్ కన్నా బంగారం ధర తక్కువగా ఉంటుందని చెబుతూ ఉంటారు. అలాగే మన భారత దేశంలో ఎక్కువగా ఉత్తర భారత దేశంలో బంగారం వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే బంగారం ధర ఎక్కువగా ఉంటుంది.

Exit mobile version