Rice: వైట్ రైస్ vs బ్రౌన్ రైస్..ఏది మంచిది…!

మనదేశంలో ఎక్కువ మంది అన్నతం తినేందుకు ఇష్టపడుతుంటారు. అన్నంలో కార్బోహైడ్రెట్స్ ఎక్కువగా ఉండటంతో మనల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది.

  • Written By:
  • Publish Date - February 2, 2022 / 07:00 AM IST

మనదేశంలో ఎక్కువ మంది అన్నతం తినేందుకు ఇష్టపడుతుంటారు. అన్నంలో కార్బోహైడ్రెట్స్ ఎక్కువగా ఉండటంతో మనల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఏడాది పొడవునా అన్నం తింటే బరువు పెరగడంతోపాటు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే అన్నం తినాలి కానీ బరువు పెరగవద్దు అనుకుంటే బ్రౌన్ రైస్ తినడం మంచిది. వైట్ రైట్ కు బ్రౌన్ రైస్ కు మధ్య గల తేడా తెలుసుకుందాం.

వైట్ రైస్….
భారత్ లో సాధారణంగా వాడే వెరైటీ వైట్ రైస్. ఇది రిఫైండ్ రైస్. ఈ ప్రాసెస్ ల కొన్ని పోషకాలను కోల్పోతుంది. వైట్ రైస్ లో పోషకాలు తక్కువ ఉన్నప్పటికీ…శక్తి మాత్రం పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే స్టార్చ్ కాన్సంట్రేషన్ తో ఈ రైస్ ఏ ఇతర వెరైటీ కన్నా కూడా ఎక్కువ శక్తిని అందిస్తుంది.

​బ్రౌన్ రైస్..
రిఫైనింగ్ ప్రాసెస్ జరగని వైట్ రైసే ను బ్రౌన్ రైస్ అంటారు. వైట్ రైస్ కన్నా బ్రౌస్ రైస్ లో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ రైస్ నుంచి పోషకాలు పోవు. ఎక్కువ మంది ప్రజలు వైట్ రైస్ నుంచి బ్రౌన్ రైస్ కి మారడం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా బ్రౌన్ రైస్ కు ప్రాధ్యాన్యత బాగా పెరిగింది. అయితే ఈ రైస్ ను వండటంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే త్వరగా మెత్తగా ముద్దలా మారిపోతుంది. ఈ మధ్యే జరిగిన పరిశోధనల ప్రకారం ప్రతిరోజూ ఒక కప్పు బ్రౌన్ రైస్ తీసుకుంటే డయాబెటిస్ వచ్చే అవకాశం 60శాతం తగ్గుతుంది.

​బ్రౌన్ రైస్ తింటే బరువు తగ్గడం సులభం…
బ్రౌన్ రైస్ లో ఉండే ఫైటేట్స్ వంటి యాంటీ న్యూట్రీషియన్స్ కారణంగా వైట్ రైస్ ఆరోగ్యానికి మంచిదని కొంతమంది ఆహార నిపుణుల అభిప్రాయం. బ్రౌన్ రైస్ లో ఫైటిక్ యాసిడ్స్ ఉంటాయి. అయితే ఇవి వైట్ రైస్ లో ఉండవు. ఈ బ్రౌన్ రైస్ లో ఉండే ఫైటిక్ యాసిడ్ ఆరోగ్యానికి మంచిది కాదు. మిల్లింగ్ ప్రాసెస్ లో రైస్ బ్రాన్ను తొలగిస్తే రైస్ వైట్ గా మారుతుంది. ఇది జీర్ణక్రియకు ఎక్కువ పనిచెబుతుంది. దాంతో జీర్ణక్రియకు హాని కలిగించే ఫైబర్ కంటెంట్ ను తగ్గించి జీర్ణక్రియ ట్రాక్ ను రక్షిస్తుంది.

​న్యూట్రీషియన్స్ ఎక్కువ..
ఇక బ్రౌన్ రైస్ లో న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిన్ బ్రాన్ అండ్ ఫైటిక్ యాసిడ్స్ ఉండవు. మెగ్నీషియం, విటమిన్ బి6, ఐరన్, క్యాల్షియం, ప్రొటీనులు, పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటాయి. వీటిలో కార్పోహైడ్రేట్స్ కూడా అధికంగా ఉంటాయి.

ఆర్సెనిక్ అస్సలు ఉండదు…
వైట్ రైస్ లో ఆర్సెనిక్ వంటి కంటెంట్ లేదు. బ్రాన్ లో ఆర్సెన్సిక్ ను గుర్తించారు. ఈ బ్రాన్ బ్రౌన్ రైస్ లో ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇందులో ఆర్సెనిక్ లెవల్స్ కూడా ఉంటాయి. బ్రౌన్ రైస్ తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

​మధుమేహం….
ఎక్కువగా పాలిష్ చేసిన రైస్ లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువ. అంటే దాంతో వండిన అన్నం తిన్నట్లయితే మన బాడీలోని రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వెంటనే పెరుగుతాయి. కానీ బ్రౌన్ రైస్ లో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ. దీంతో వండిన అన్నం తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అందుకే బ్రౌన్ రైస్ డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే డయాబెటిస్ లేని వారు కూడా బ్రౌస్ రైస్ ప్రతిరోజూ తిన్నట్లయితే డయబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

బరువు తగ్గవచ్చు….
బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. బ్రౌన్ రైస్ తింటే ఎక్కువగా ఆకలి వేయదు కాబట్టి తక్కువగా ఆహారం తీసుకుంటారు. దీంతో బరువును తగ్గవచ్చు.

గుండెకు మంచిది….
బ్రౌన్ రైస్ ప్రతిరోజూ తింటే హార్ట్ హెల్త్ మెరుపడటంతోపాటు..రక్తనాళాలు సురక్షితంగా ఉంటాయని అధ్యయనాల్లో తేలింది. బ్రౌన్ రైసులో ఉండే విటమిన్ బి1, మెగ్నిషియంలు గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.

క్యాన్సర్…
ఐనాసిటాల్ హెగ్జాఫాస్పేట్ అనే సహజసిద్దమైన సమ్మేళనం బ్రౌన్ రైస్ లో ఉంటుంది. ఇది వక్షోజ, లివర్, పెద్ద పేగు, బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల వక్షోజ, పేగుల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. బ్రౌన్ రైస్ లో ఉండే పాలిఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు కలిగి ఉంటాయి. దీంతో కణాలు దెబ్బతినకుండా ఉంటాయి.