Site icon HashtagU Telugu

Countries Race To Sun : సూర్యుడిపై రీసెర్చ్ రేసులో ఉన్న దేశాలివీ..

Countries In The Research Race On The Sun

Countries In The Research Race On The Sun

Countries Race To Sun :  సూర్యుడిపై రీసెర్చ్ కోసం కొద్దిసేపటి ముందే ఇస్రో  నిర్వహించిన ‘ఆదిత్య L1’  ప్రయోగానికి సంబంధించిన లాంఛింగ్ ప్రక్రియ సక్సెస్ అయింది.

లాంఛింగ్ ప్రక్రియలోని మూడు దశలు ఇప్పటికే సాఫీగా క్లియర్ అయ్యాయి. 

రూ.400 కోట్ల ఖర్చుతో ఆదిత్య L1 శాటిలైట్ ను 15లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్ పాయింట్ 1 కు  ఇస్రో పంపిస్తోంది.  

ఈ తరుణంలో ఇప్పటికే ఇలా సూర్యుడిపై రీసెర్చ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న దేశాలేవో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. 

Also read : Moon To Mars : చంద్రుడి నుంచి మార్స్ పైకి మిషన్.. నాసా టీమ్ కు ఇండియన్ సారథ్యం

సూర్యుడిపై రీసెర్చ్ విషయంలో ఇండియా కంటే కొన్ని దేశాలు ముందంజలో ఉన్నాయి. అమెరికా స్పేస్ ఏజెన్సీ ‘నాసా’, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ‘ఈసా’, జపాన్ స్పేస్ ఏజెన్సీ ‘జాక్సా’, జర్మనీ,  చైనాలు ఇప్పటికే వాటి స్పేస్ క్రాఫ్ట్ లను సూర్యుడిపై రీసెర్చ్ కోసం పంపించాయి. అయితే ప్రయోగాల కోసం జపాన్, జర్మనీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లు నాసా హెల్ప్ ను తీసుకున్నాయి. ఇప్పటివరకు సూర్యుడి వైపుగా భూమి నుంచి వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ ల సంఖ్య కేవలం 22 (Countries Race To Moon) మాత్రమే. ఇప్పుడు మనం పంపిన ‘ఆదిత్య ఎల్-1’ స్పేస్ క్రాఫ్ట్ 23వది అవుతుంది.

Also read : Neha Shetty: రాధిక హాట్ లుక్స్.. రెడ్ శారీ ధరించి, అందాలు ఒలకబోసి!

దేశాలవారీగా ప్రయోగాల చిట్టా..