Daughter-in-Law: కోడలిని పెళ్లి చేసుకున్న మామ.. షాకింగ్ ఘటన ఎక్కడ అంటే ?

పెళ్ళిళ్ళు స్వర్గం లో నిర్ణయించబడతాయి అని పెద్దలు అంటూ ఉంటారు. అలాంటి ఒక పెళ్ళి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Whatsapp Image 2023 01 26 At 21.51.44

Whatsapp Image 2023 01 26 At 21.51.44

Daughter-in-Law: పెళ్ళిళ్ళు స్వర్గం లో నిర్ణయించబడతాయి అని పెద్దలు అంటూ ఉంటారు. అలాంటి ఒక పెళ్ళి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. జరిగిన పెళ్లి సాధారణ పెళ్లే కానీ వధూ వరుల వరస చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. దీనికి తోడు ఇద్దరి మధ్య దాదాపు మూడింతలు వయసు వ్యత్యాసం ఉంది. ఈ పెళ్ళి గురించి తెలుసుకుని షాక్ అవవడం అందరి వంతు అయ్యింది

ప్రస్తుతం ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇందులో ఒక అమ్మాయి ఒక ముసలి వ్యక్తి పక్క పక్కనే పూలదండలతో ప్రత్యక్షం అయ్యారు. వీరి నుదుటున పెళ్ళి బొట్టు కూడా ఉంది. అమ్మాయి వయసు 28 సంవత్సరాలు కాగా పెళ్ళికొడుకు వయసు 70. ఇద్దరి మధ్య మూడు వంతుల వయసు వ్యత్యాసం.

కోడలిని పెళ్ళి చేసుకున్న మామ గారు!

దానికి తోడు వారు వరసకి మామా కోడళ్ళు. మేనకోడలు కూడా కాదు. స్వయానా అతగాడి కొడుకు భార్య. అయితే కొడుకు మరణించాడు. భర్తని కోల్పోయి పుట్టెడు దుఃఖం లో ఉన్న ఆ యువతికి తోడు ఉండాలని అనుకున్న ఆ వ్యక్తి పెళ్ళి చేసుకున్నాడు. మామగారు చేసిన పనికి బిత్తరపోకుండా సరే అంటూ తన మద్దతు తెలిపింది. ఇది జరిగింది ఎక్కడో కాదు మన దేశంలోనే. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో జరిగింది ఈ సంఘటన. కైలాష్ యాదవ్ వయసు 70 సంవత్సరాలు. అతనికి నలుగురు కొడుకులు. అందరికీ వివాహాలు అయ్యాయి వారు స్థిరపడ్డారు. అయితే కైలాష్ యాదవ్ మాత్రం వంటరిగానే బతుకుతున్నాడు. దానికి కారణం అతని భార్య చనిపోవడం. దాదాపు 12 సంవత్సరాల క్రితమే ఆయన సతీమణి చనిపోయింది. దీంతో ఆయనకి వంటరితనం అలవాటు అయ్యింది.

అయితే అతని మూడవ కొడుకు ఇటీవల చనిపోయాడు. దీంతో కోడలు వంటరిగానే ఉంటుంది. ఒంటరితనం ఎంత బాధాకరమో తెలిసిన కైలాష్ యాదవ్ కోడలిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు. కోడలు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఈ విచిత్ర పెళ్లి మీద మిశ్రమ స్పందన లభిస్తుంది.

  Last Updated: 26 Jan 2023, 10:05 PM IST