Site icon HashtagU Telugu

Corona: కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందంటే..? కీలక విషయాలు బయటపెట్టిన సైంటిస్టులు

Covid

Covid

Corona: కరోనా ప్రపంచాన్ని ఇప్పటికీ వణికిస్తూనే ఉంది. ఇప్పటికీ కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. దాదాపు మూడేళ్ల నుంచి ప్రపంచాన్ని కరోనా భయపెడుతూనే ఉంది. కరోనాతో ప్రపంచం అల్లాడిపోయింది. ఎంతోమంది ప్రాణాలను బలిగొనగా.. కరోనా వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పటికీ మనుషులను వెంటాడుతూనే ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారికి ఎన్నో కొత్త వ్యాధులు వస్తున్నాయి.

అయితే కరోనా ఎలా వచ్చిందనే విషయం ఇప్పటికీ తెలియలేదు. సైంటిస్టులు కనిపెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. చైనాలోని చేపల మార్కెట్ నుంచి వచ్చిందని కొంతమంది చెబుతుండగా.. చైనాలోని వ్యూహాన్ ల్యాబ్ లో తయారు చేసినట్లు కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే కరోనా నమూనాలను అధ్యయనం చేసిన సైంటిస్టులు.. తాజాగా కరోనా పుట్టుక, వ్యాప్తి గురించి కీలక విషయాలు బయటపెట్టారు.

చైనాలోని హువానాన్ చేపల మార్కెట్ నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించి సైంటిస్టులు కీలక విషయాలను బయటపెట్టారు. చైనా మార్కెట్ లోని కరోనా పాజిటివ్ శాంపిల్స్ ను పరీక్షించినప్పుడు అడవి జంతువుల జన్యు పదార్థాలు ఉన్నాయన్నారు. దీంతో కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెంది ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే దీనికి కనిపెట్టడానికి మూడేళ్ల సమయం పట్టిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అయితే చైనాలోని వివిధ మార్కెట్లలో మంసాన్ని విక్రయిస్తున్న ప్రాంతాల నుంచి కూడా కరోనా పాజిటివ్ శాంపిల్స్ సేకరించి టెస్టులు చేశారు. దీని ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తికి జంతువులే కారణమని తేలింది. జంతువుల ద్వారా మనిషికి వచ్చినట్లు గుర్తించారు. రాకూన్ జాతి కుక్కల జన్యుపదార్థంలో కరోనా కారక సార్స్ కోవ్-2 అనే వైరస్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. అయితే మార్కెట్ లోని స్టాల్స్, షోకేజ్ లు, పరిసర ప్రాంతాల నుంచి సేకరించిన నమునాల్లో కరోనా వైరస్ ఉన్నంత మాత్రాన జంతువల నుంచి వచ్చిందని చెప్పలేమని కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు.

భవిష్యత్తులో జరిపే పరిశోధనలకు ఇవి పనికి వస్తాయని భావిస్తున్నట్లు ప్రొ.డేవిడ్ చెప్పరాు. చైనాలోని వ్యూహాన్ ల్యాబ్‌లో కరోనా వైరస్ ను తయారుచేశారని, అది బయటకు లీక్ అయిందని అమెరికా గతంలో అనేక ఆరోపణలు చేసింది.