Cemetery: ఇదెక్కడి పెళ్లిరా బాబు, స్మశానంలో పెళ్లి వేడుక!

పెళ్లంటే రెండు నిండు జీవితాలు ఒక్కటయ్యే అద్భుత ఘట్టం. ప్రతీ ఒక్కరి జీవితంలో అది ఎంతో ప్రత్యేకం.

  • Written By:
  • Updated On - February 7, 2023 / 09:32 PM IST

Cemetery: పెళ్లంటే రెండు నిండు జీవితాలు ఒక్కటయ్యే అద్భుత ఘట్టం. ప్రతీ ఒక్కరి జీవితంలో అది ఎంతో ప్రత్యేకం. అందుకే ఆ వేడుక ఎలా జరుపుకోవాలి అని ముందునుండే ఎన్నో కలలు కంటారు చాలా మంది. పెళ్ళిలంటే డెకరేషన్, ఇంటి ముందు పందిరి అబ్బో ఆ హడావిడి మాములుగా ఉండదు. అయితే ఈ మధ్య కొన్ని వింత పెళ్లిళ్లు, పెళ్లిళ్లలో వింత ఆచారాలు చూస్తూ ఉన్నాము. అలా వింత పెళ్లిళ్లలో జరిగే సంగటనలు చూసి ఆశ్చర్యపోతారు అందరు. ఇప్పుడు మీరు చదవబోయే విషయంలో మాత్రం పెళ్లి వెదికే ఒక ఆశ్చర్యం.

పంజాబ్ రాష్ట్రంలోని మొహ్కంపుర అనే గ్రామంలో ఒక వృద్ధురాలు నివసిస్తూ ఉండేది. ఆమెకు తోడుగా తన మనమరాలు ఉండేది. వారిద్దరికీ పెద్దగా ఆస్తిపాస్తులేమీ లేవు. ఇల్లు వాకిలి కూడా లేవు. అయితే ఆ గ్రామ స్మశానంను అనుకుని ఉన్న ఖాళీ స్థలంలో ఆమె నివసిస్తూ ఉండేది. తన మనవరాలు పెళ్లి వయసుకు రావడంతో ఎలాగైనా పెళ్లి అనుకుంది ముసలమ్మ. దానికోసం వివిధ ప్రయత్నాలు చేసింది. ఇలా ఉండగా గ్రామస్థులు ఆమె చూసి తలో కొన్ని డబ్బులు వేసుకుని పెళ్లికి కావాల్సిన డబ్బు సమకూర్చారు.

అయితే అన్ని సిద్ధం చేసిన వారు పెళ్లి వేదికను మాత్రం స్మశానంలోనే వేసేసారు. వేదిక శ్మశానంలో వేసి పెళ్లి వేడుకను బాగానే నిర్వహించారు. భోజనాలు మాత్రం పక్కన వేరే స్థలంలో ఏర్పాటు చేశారు. దీనితో ఈ విషయం తెలిసిన వారంతా స్మశానంలో పెళ్లి సంఘటనను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇలా స్మశాన వాటిక స్థలంలో వివాహ తంతు పూర్తి అయ్యి, ఆ జంట ఒక్కటయ్యారు. వచ్చినవారంతా పెళ్లి ఎక్కడజరిగితే ఏమిటి.. కానీ జంట కలకాలం సుఖంగా ఉంటె చాలు అని కోరుకుంటున్నారు.

చాలా మంది అశుభంగా భావించే స్థలంలో, పవిత్రమైన వివాహ వేడుక జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని గుసగుసలు పెట్టుకుంటున్నారు మరికొందరు. ఇక సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న ఈ శ్మశానపు పెళ్లి సంఘటన ట్రేండింగ్ గా మారింది. దీనిపై నెటిజెన్స్ వివిధ రకాలుగా తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు.