Site icon HashtagU Telugu

Bandi: అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలు మాయం… ‘కేసీఆర్’ పై ‘బండి సంజయ్’ ఫైర్.!

Bandi letter to cm kcr

Kcr Bandi

ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలను మాయం చేసి నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కోర్టు కేసులు, ఇతరత్రా సాకులతో ఉద్యోగాల భర్తీని వాయిదా వేస్తే సహించబోమన్నారు. ఈ విషయంలో కేసీఆర్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా… ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల్లోకి వెళ్లబోమని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగాల భర్తీ, కొత్త జోనల్ విధానం ఆలస్యం కావడానికి కేంద్రమే కారణమన్న కేసీఆర్ వ్యాఖ్యలపై సంజయ్ తీవ్రంగా స్పందించారు. నోటిని అదుపులో ఉంచుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదలైన 40 నెలల దాకా స్పందించని కేసీఆర్… తన చేతగానితనాన్ని కేంద్రంపై నెట్టడం సిగ్గు చేటన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, కార్యదర్శులు డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, ఉమారాణి, అధికార ప్రతినిధులు జె.సంగప్ప, పోరెడ్డి కిషోర్ రెడ్డి, రాణి రుద్రమదేవి తదితరులతో కలిసి బండి సంజయ్ మాట్లాడారు.

Exit mobile version