Liquor Bottle Price: ఈ లిక్కర్ బాటిల్ ధర వింటే వామ్మో అనకుండా ఉండలేరు.. ఏకంగా కోట్లల్లోనే ఉందిగా?

ఈ మధ్యకాలంలో చాలామంది మద్యానికి బాగా అలవాటు పడుతున్నారు. చిన్న.. పెద్ద.. అనే వయసుకు సంబంధం లేకుండా కిక్కు కోసం మందు బాటిల్ లేపుతున్నారు. ఆడవాళ్లు సైతం మందంటే ముందుంటున్నారు.

  • Written By:
  • Publish Date - March 28, 2023 / 10:40 PM IST

Liquor Bottle Price: ఈ మధ్యకాలంలో చాలామంది మద్యానికి బాగా అలవాటు పడుతున్నారు. చిన్న.. పెద్ద.. అనే వయసుకు సంబంధం లేకుండా కిక్కు కోసం మందు బాటిల్ లేపుతున్నారు. ఆడవాళ్లు సైతం మందంటే ముందుంటున్నారు. ఇక ఈ మద్యం ప్రియులను దృష్టిలో పెట్టుకొని మద్యం తయారు చేసే కంపెనీలు కూడా ఓ రేంజ్ లో కిక్ ఇచ్చే మందులను అందిస్తున్నారు.

ఇప్పటికే ఎన్నో రకాల బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. చీప్ లిక్కర్ తో పాటు కాస్ట్లీ లిక్కర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. బాగా మద్యాన్ని ఇష్టపడే వాళ్ళు కొన్ని కొన్ని సార్లు ధర ఎక్కువ ఉన్నా కూడా పట్టించుకోకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో ఖరీదైన ఆల్కహాల్ బ్రాండ్లు దొరుకుతున్నాయి. వీటిని నిత్యం కొనుగోలు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ.. కానీ ఒక్కసారైనా ఖరీదైన బ్రాండ్ తాగాలి అని మద్యం ప్రియులు కోరుకుంటూ ఉంటారు.

అందుకే కాబోలు భారీగా డిమాండ్ పెరిగిపోతుంది. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం ఉందని మీకు తెలుసా. పైగా వాటి ధర వింటే మాత్రం వామ్మో అని షాక్ అవ్వకుండా ఉండలేరు. ఇంతకు అవేంటో తెలుసుకుందాం. టెకీలా లీ 925. ఈ వైన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా మొదటి స్థానంలో నిలిచింది. ఇక దీని ధర దాదాపు రూ.25 కోట్లని తెలుస్తుంది. ఇక దీని సీసాలో 6,400 వజ్రాలు పొదిగి ఉంటాయట.

హెన్రీ ఐవీ డుడోగ్నే కాగ్నాక్. ఇక ఇది ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన వైన్. ఇక దీని ధర 56 లక్షల 93 వేల రూపాయలు. ఇక దాన్ని బాటిల్ కూడా 24 క్యారెట్ల బంగారం అమరికా ఉండగా దీనిని ప్లాటినంతో తయారు చేస్తారని తెలిసింది. ఇక అత్యంత ఖరీదైన షాంపైన్ అంటే అమండా డి బ్రిడ్నాక్ మిడాస్. ఇది ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇక ఈ షాంపైన్ ఒక్క బాటిల్ ధర రూ.1 కోటి 40 లక్షల రూపాయలు ఉంటుందని తెలుస్తుంది. ఇక అత్యంత ఖరీదైన రెడ్ వైన్ కూడా ఒకటి ఉంది. అదే పెన్ఫోల్డ్స్ ఆంపౌల్. ఇక దీని బాటిల్ రేటు వచ్చేసి కోటి రూపాయలపై ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ ధరలు వింటే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవ్వకుండా ఉండలేరు.