5G Network: ఇండియాలో 5జీ నెట్‌వ‌ర్స్ లాంచ్ అయ్యేది ఎప్పుడంటే..?

  • Written By:
  • Publish Date - March 8, 2022 / 02:27 PM IST

భార‌త్‌లో ఇప్పటి వరకు 2జీ, 3జీ, 4జీ నెట్వర్కింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే దేశంలో 5జీ నెట్‌వర్క్ సేవలు ఊరిస్తూనే వున్నాయి. ఓ వైపు మార్కెట్‌లో 5జీ మొబైల్ ఫోన్లు కంపెనీలు విడుదల చేసేస్తున్నా, 5జీ నెట్‌వర్క్ మాత్రం అందుబాటులో రావడంలేదు. మార్కెట్‌లో హ్యాండ్‌సెట్ల హడావిడి తప్ప నెట్‌వర్క్ సందడి కన్పించడం లేదు. వాస్తవానికి 2021 మే నెలలోనే కేంద్ర ప్రభుత్వం 5జీ ట్రయల్స్ కోసం వివిధ టెలికం కంపెనీలకు స్పెక్ట్రం కేటాయించిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో ట్రయల్స్ నిర్వహించేందుకు జియో, భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, ఎంఎన్‌టిఎల్‌లు అనుమతి పొందాయి. అయితే నిర్దేశిత లక్ష్యం ప్రకారం గ‌త ఏడాది నవంబర్ నెలలోగా ట్రయల్స్ పూర్తి చేయాల్సి ఉన్నా.. నిర్దేశిత సమయంలోట్రయల్స్ పూర్తి కాలేదు. దీంతో మరో ఆరు నెలల గడువు ఇవ్వాల‌ని కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ క్ర‌మంలో టెలికం కంపెనీలు కోరిన విధంగా మరోసారి ట్రయల్స్ గడువు పెంచ‌డంతో 5జీ నెట్‌వర్క్ సేవలు వాణిజ్యపరంగా అందుబాటులో వ‌చ్చేందుకు ఆల‌స్యం అయ్యింది. అయితే ఎలాగైనా జూన్ నాటికి భార‌త్‌లో 5జీ సేవ‌లు ప్రారంభించాల‌ని టెలిక‌మ్యూనికేష‌న్స్ డిపార్ట్‌మెంట్‌(డీవోటీ) ప్ర‌క‌టించింది.